సాఫ్ట్వేర్ మొగుడు

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

సాఫ్ట్వేర్ మొగుడు

రచయిత :: చలిమేడా ప్రశాంతి

మాఘమాసం వచ్చిందోయ్ మామ
లగ్గం చేసుకుందాం రా మామ
నీ సొర కత్తుల చూపులకి కళ్లెం వేస్తా
నా మెడకు పసుపుతాడు వేయరా అంటే
వద్దు వద్దుయే నా వయ్యారి భామ
ఈ గణన యంత్రంలో నా మనసే దాగె
ఈ లాక్డౌన్ పుణ్యమా ఇల్లే కారాగారం అయ్యేనే
ఈ సమయంనా మెడకొ డోళ్లు అన్నట్లు నిన్నెక్కడ పెట్టుకొను నా ముద్దుల మరదలా అంటున్నాడే నా
కాబోయే చాదస్తం మొగుడు.
అట్లో ఇట్లో అమ్మానాన్నలని ఓపిస్తే
మంచి ముహూర్తం కుదిరి పెళ్లిపిట్టలు ఎక్కితే
తాళికట్టు సమయాన నా చాదస్తం మొగుడు లాపిలో తల దురుసుతు ఆ కాస్త పూస్తే పూజారికి కట్టే నేనేం చేస్తురా
దేవుడా.
కూరో మోరో అనుకుంటూ ఆ లగ్గం కాస్త జరిపిస్తే
సిగ్గులా మొగ్గలతో అందగా ముస్తాబై పాలగ్లాస్ తో
శోభనం గదిలోకి నేను అడుగుపెడితే తెల్లవార్లు జాగారం చేపిచెను.ఆ పాడుపడ ప్రోగ్రాం కంప్లీట్ అయ్యేవరకు శోభనమే లేదనాడే నా చాదస్తం మొగుడు.
అంత మంచికే అనుకుంటూ తన పని అయిపోయిందిలే మా కార్యంకి అడ్డులు తొలిగాయి అనుకుంటే ఈ సారి కరోనా బాంబు పేల్చి ఆరడుగుల దూరం మూతికి మాస్కు తగిలించి చెరొక గది పంచుకుందాం అంటాడే నా చాదస్తం మొగుడు.
ఈ లాక్డౌన్ లో పెళ్లి జరిగింది అని ఆనందించె లోపే శోభనానికి బ్రేక్ పడింది అని బాధపడేలా చేసాడు నా
చాదస్తం మొగుడు.

You May Also Like

One thought on “సాఫ్ట్వేర్ మొగుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!