వ్యవ”సాయం”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: సూర్యదేవర స్వాతి
వ్యవసాయం “సాయం” కోసం చూస్తున్నది!
రైతాంగం పంట కొనుగోలు కోసం చూస్తున్నది!
అన్నం పెట్టే రైతు ఆ అన్నమే లేక చస్తున్నది!
కొడుకులాంటి పంట వానమ్మ జడిలో తడుస్తున్నది!
అమ్మేవాడికి చేతిలో అర్ధరూపాయి!
కొనేవాడికి అరచేతిలోకి కూడా రాని అన్నం!
మధ్యలో దళారికి గాదె నిండెను నిండుగా!
ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే చేతులెత్తేసిన వైనం!
అన్యాయాన్ని అడిగేవాడు లేడు, ఆపేవాడు లేడు!
ఎదురుతిరిగినవాడికి బతుకులేదు!
బలవంతుని రాజ్యంలో…
బలహీనమైన రైతు కన్నీటి గాధలు!
ఎదుగుతున్నామని అనుకుంటున్న జనులరా!
తిండిలేని, దొరకని రోజు మున్ముందు ఉంది జాగ్రత్తపడండి!
రైతుని ఆదుకోండి!
ఆపన్నహస్తం అందించండి!!.