జీవితం – నిస్వార్థ సేవాతత్త్వం 

జీవితం – నిస్వార్థ సేవాతత్త్వం 

రచన:: వి. కృష్ణవేణి

జీవితమంటే త్యాగం, నిస్వార్థ సేవాతత్వం
కలిగి ఉంటూ
మానవత్వాన్ని చూపుతూ
నలుగురికి తన వంతు  సహాయమందిస్తూ
తోటివారికి అయిన వారికి నీనున్నాననే భరోసా ఇస్తూ..
దేనికి వెనకడుగు వేయయకుండా
కాలంతో పాటు తను అవకాశాలను అందిపుచుకుంటూ సేవానిరతితో
కష్టపడి పనిచేస్తూ..
ఎంతోమంది త్యాగ నిరతితో చేసిన సేవలను గుర్తించి.
వారి నిస్వార్థ సేవను అభినందిస్తూ
వారి బాటలో నడుస్తూ..
నేను నాది అనే భావనకు తావివ్వకుండా
కుల,మత, వర్గ,వర్ణ భేదాభావన లేకుండా
అందరితో సమాన సేవా తాత్వాన్ని అందిస్తూ
సమాజానికి మార్గదర్శిగా..
సమాజం పట్ల గౌరవం కల్గి
మానవతావాదదృక్పధంతో
మనో థైర్యాన్ని నింపుకుని
అభివృద్ధి మార్గాలను ఎంచుకుని
సమాజంలో తన కంటూ ఒక స్థాయి
గుర్తింపు చూడగోరుతూ
మునుముందుకు సాగిపోతూ
సమాజ శ్రేయస్సే తన లక్ష్యం అంటూ
జీవనమార్గంలో పయనించి
నలుగురికి ఆదర్శంగా నిలిచి
జీవితపరమార్దాన్ని చాటి చూపాలి.
అదే నిజమయిన జీవితం.
అదే నిస్వార్థ జీవన గమనం.
అదే నిజమైన జీవితానికి పరమార్థం.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!