సాపాసా సాధన(హాస్య కవిత)

సాపాసా సాధన(హాస్య కవిత)

రచన:: చంద్రకళ. దీకొండ

చిన్నతనంలో కన్న కలలు…
తీరిక దొరికిన వేళ నెరవేర్చుకోవాలని ఆరాటం…
అరవైలో ఇరవై వయసు
ఉత్సాహం…
వేకువనే లేచిన దగ్గర్నుంచీ
చేస్తోంది సాపాసా సాధన…!
తలచుకుంటే సాధ్యం కానిదేదీ
నారికి లేదని…
తనకు తాను స్ఫూర్తిని కలిగించుకుంటూ…
పాలూ మిరియాలతో గొంతును శ్రుతి చేసుకుంటూ…
చేస్తోంది దినమంతా అభ్యాసం…
స్వరాల విన్యాసం త్వరగా వంటబట్టాలని…
సరిగమలు రాని శ్రీలక్ష్మి…!
శంకరాభరణం సినిమాలో చిన్ని శారదలా…
తెల్లవారుజాము వర్షంలో తడిసి…
గొంతును వణికించి గమకాలు పలికించలేక తాను తడిబట్టలతో వణుకుతూ…
అష్టకష్టాలు పడి అపశ్రుతులను సవరించాలని దీక్ష బూనింది…!
తంబూరా శ్రుతి ఎందుకు దండగ…
చెంత శ్రీవారుండగా…
అనుకుంటూ…
వేడుకుంది “కాస్త నా పాటకు
తాళం వేద్దురూ”అంటూ…!
“ఆహా…ఏమి నా
భాగ్యమూ”అంటూ మురిసిన
అపశ్రుతుల బాధిత శ్రీపతి…
అదే అదునుగా…
వేసాడు తలుపుకు తాళం…
పరులెవరూ వచ్చి పరువు తీయకుండా…
పడింది శ్రీలక్ష్మి నోటికి కళ్లెం…!!!

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!