పెదవి దాటని మాట

పెదవి దాటని మాట

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: విజయ మలవతు

శ్రీ గారికి,
ఏంటోయ్ ఎప్పుడు ఇలా ఇంత ముద్దుగా పిలవదే నన్ను అని అనుకుంటున్నారా.. మళ్ళీ ఎవరికి రాశానో చూస్తున్నారా.. మీకేనండి రాసింది.. ఒహ్హ్ పిలుపు మారింది అనా..! అయితే ఒరిజినాలిటీ కి రానా మరి… హహహ…
మీకోసమే మామా… అబ్బా ఇప్పుడు వచ్చిందే నవ్వు
అబ్బా ఏమి నవ్వుతావయ్యా బాబు… గుండెల్లో గుచ్చేలా… ఇలా నవ్వే ఏమో కాలేజ్ లో అంతమంది ఫ్యాన్స్ తయారయ్యారు… అయినా తెలియక అడుగుతాను మీ కాలేజ్ లో నువ్వొక్కడివేనా బాగా చదివే వాడివి.. అందంగా ఉండేవాడివి.. అందరూ నీ వెంటే పడాలి అనేంతగా ఏమి చూసారో నీలో.. సరేలే ఎవరెన్ని బాణాలు వేసినా నాకేగా నీ ప్రేమ దక్కింది. అది చాలు గా.!
అయినా మనసులో అంత ప్రేమ పెట్టుకొని అందరికి నేనంటే ఇష్టం అని చెప్పి నాకు మాత్రం చెప్పకుండా ఎలా ఉన్నావయ్యా.. అంత పంతం ఏంటి అసలు నాతోనే మొదట చెప్పించుకోవాలి అని.
అంత బలవంతంగా పెళ్లికి ఒప్పించి పెళ్లి చేసుకొని నాతోనే నువ్వంటే ఇష్టం అని చెప్పించుకోవటం ఏంటో.!  బాగుందయ్యా ఈ పద్ధతి ఏదో.! ఎలాగైనా అనుకున్నది సాధించావ్ గా! కానీ నీ ప్రేమలో తడిసి ముద్దవుతున్న నాకే అనిపించిందిగా ఇంత ప్రేమకు నేను తగినదాన్నా అని, ప్రేమ చెప్పడంలో కాదు చూపటంలో ఉండాలి అనేది నిజం చేసి చూపించావయ్యా!
రాబోయే కాలమంతా మీ ప్రేమలో మురిసిపోవాలి అనుకున్నా కానీ.!

మీ
ప్రియసఖి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!