ఇలానే ప్రేమిస్తా
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: భానుతేజశ్రీ
అనుకోకుండా పరిచయం అయ్యావు
నా కోసం చాలా చేశావు
ఆకాశమంత ప్రేమ ఇచ్చావు
నా అణువణువు నువ్వు నిండావు
నీ కోసం నేను బ్రతికున్నా బ్రతుకుతా
నీతో వుండే అవకాశం లేదేమో కానీ
నీ కోసం బ్రతికే అవకాశం ఉంది
గుడ్డిగా నమ్మాను అలానే ప్రేమిస్తున్నాను
నీ ప్రేమ అణువంత తగ్గినా ఉండలేను.
నా చివరి ఊపిరి నిన్ను చూసే ఆగాలి
పెళ్లి చేసుకునే అదృష్టం లేదు
కలిసి వుంటే సమాజం తప్పుగా చూస్తుంది
విడి పోవాలి అంటే మనసు రాదు
చచ్చి పోవాలి అంటే ధైర్యం చాలదు
ఈ క్షణం చెప్తున్నా
నన్ను కన్నా అమ్మ తరువాత అమ్మవి అయ్యావు
నాన్న ఇచ్చే ధైర్యం ఇచ్చావు
తోబుట్టువులా తోడుగా వున్నావు
స్నేహితుడిలా బాధ పంచుకున్నావు
ప్రేమికుడిలా ప్రేమ పంచావు
నా కడుపున పుట్టకపోయినా నాకు కొడుకు అయ్యావు
నా ఈ జన్మ నీతో ముడిపడి ఉంది
వదులుకోవాలని లేదు
ఉండిపోవాలని ఉంది
నువ్వు దక్కక పోతే ప్రాణం వదిలేయాలని ఉంది
నిన్ను ఇలానే ప్రేమిస్తా నా ఊపిరి ఆగే వరకు.