యుద్ధోన్మాదం

యుద్ధోన్మాదం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: శింగరాజు శ్రీనివాసరావు

ఏమిటీ ఉన్మాదం?
మరణం లోపే మారణహోమం సృష్టించి
శవాలదిబ్బల మీద ఆధిపత్య జెండాపాతి
బూడిదను ఏలుకునే బరితెగింపు దేనికి

ఏం సాధిస్తావు?
పచ్చని భూతలాన్ని రుధిర సంద్రం చేసి
పాపం తెలియని ప్రజలను పుటంపెట్టి
నరరూప రాక్షసుడిగా నిలవడం తప్ప

అశాశ్వతమైన అధికారదర్పం
కంటిచూపును చంపే అహంకారం
సాటివాణ్ణి నాశనం చేసే దురభిమానం
కవచాలుగా నిలువలేవే చావు దగ్గరైనపుడు

పిచ్చుకల మీద బ్రహ్మాస్త్ర ప్రయోగమెందుకు
మీతిమీరిన రాజ్యకాంక్ష తలకెక్కించుకోకు
యుద్ధాలతో వినాశనం తప్ప సాధన శూన్యం
సామరస్యమే సర్వత్రా విజయసోపానం

పంచితే పెరిగేది ప్రేమని తెలుసుకో
మంచితో సాధించలేని విజయాలు లేవు
ప్రాణాలు తీసే అమానుషత్వాన్ని వదులకో
ప్రాణం పోసే మార్గాన్ని తెలిసి మసలుకో….

…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!