ఆశ్విజ

ఆశ్విజ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యోదయానికి ముందే మంచు రగ్గును చిల్చు కుంటూ సూర్య కిరణాలు, వాటి తో పాటు కారు హెడ్ లైట్స్ కూడా పరుగు పెడుతున్నాను. మంచు చుక్కలు గ్లాస్ పై పడి ముత్యాల్లా మెరుస్తున్నాయి.
కార్లో ఉన్న ఆశ్విజ కిరణ్ ఇద్దరు కూడా ఎంతో బాగా ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ వస్తున్నారు. ఎప్పుడు ఇంత తెల్ల వారగట్ల ప్రయాణం చెయ్యరు ఇల్లు ఆఫీస్ పని సరిపోతుంది. వారి ఉరికి రెండు గంటల ప్రయాణం అయిన ఆఫీస్ కి సమయానికి వెళ్ళడం కష్టం అని ఆ సిటీ లోనే ఆఫీస్ క్వా టర్ లో ఉంటున్నారు. అమ్మకి రథ సప్తమి అంటే ఇంతో ప్రాణము తను పుట్టడానికి ముందు సూర్య పూజలు చేసి మొక్క నైవేద్యం పెట్టే తనను కన్నానని చెపుతుంది అందుకే సూర్య కిరణ్ పేరు పెట్టింది.
గారంగా బామ్మ అమ్మ పెంచారు. నాన్న కేవలం ప్రేక్షక మహాశయుడు, అన్ని బామ్మ చూసుకునేది తాత గారు కూడా బామ్మ మాటకు విలువ నిచ్చి కుటుంబం నడిపే వారు , ఈ రోజు మాఘ పాధి వారము పాలు పొంగించి సూర్యునికి నివేదన పెట్టాలి అందుకు తెల్ల వారాగట్ల బయలు దేరారు
పిల్లల్ని తాతగారు వచ్చి శుక్రవారం రాత్రి తీసుకుని వెళ్ళారు శనివారం పిల్లలకి హఫ్ డే. వాళ్ళ కూడా పెద్దల దగ్గర బాగా అలవాటు కధలు వింటారు. అందుకు ఎంతో సంబరంగా వెళ్లి పోతారు. కారు వచ్చి గుమ్మంలో ఆగింది పాలేరు వచ్చి బ్యాగులు పట్టుకెళ్ళాడు పళ్ళు పువ్వులు తెచ్చారు. అప్పటికి ఇంటి గుమ్మాలకు తోరణాలు పువ్వులు గడప లకి పసుపు కుంకుమలు, వాకిలి ముందు రంగ వల్లులు, ఇలా ఇంటికి పండుగ శోభ వచ్చింది. వాళ్ళకి పట్టు పంచే పట్టు చీర కోని ఉంచింది అధి బామ్మ గారి బహుమతి. అశ్వజ ను ఎంతో పొగిడారు ఇంటికి పుత్ర వంశాన్ని ఇచ్చింది. వంశం నిలబడింది. అందుకని ఇంటి కోడల్ని ప్రేమగా చూసుకోవాలి ఎక్కడ నుంచి వచ్చిన అంటుమొక్కల ఇక్కడ ఇమిడి పోతుంది. ఆడపిల్ల ఆమెను పెళ్లి తరువాత చూసేది భర్త ప్రేమ అత్తింటి ప్రేమ. అంటూ బామ్మ గారు, తాత గారు, అత్త , మామ ఎంతో ప్రేమగా చూస్తారు. మెడమీద పెద్ద ముగ్గు పెట్టీ భోగి పిడకల తో దాలి పెట్టీ పెద్ద ఇత్తడి గిన్నె పెట్టీ దానికి పసుపు కుంకుమ పెట్టీ దాలీ మంటపై లీటర్ పాలు పెట్టించి ఆవు నెయ్యి, వేసి తడి బియ్యం వేసి, భర్త పిల్లలు, కుటుంబ సభ్యులు పేర్లు చెప్పి పాలు ఉడికించి బియ్యం మెత్త పడ్డాక బెల్లం వేసి కలిపి మరి కొంత నెయ్యి వేసి కలిపి దింపయాలి.
దానితో పాటు నానిన పేసల, మొలకలు చలివిడీ వడపప్పు, పానకము నివేదన పెట్టాక, అంతా కిందికి వచ్చి శ్రీ వేంకటేశ్వర దీపారాధన శ్రీ సత్య నారాయణ వ్రతం చేశాక నివేదనలు ప్రసాదం పులిహోర గారెలు బూరెలు నివేదన పెట్టే ప్యాకెట్లు కట్టించి అందరికీ వాయనంగా ఇచ్చారు, భార్య భర్త చే బ్రాహ్మడు వచ్చి పూజ చేయించాడు పద్దతిగా సూర్య నామాలు స్తోత్రం చదివి విష్ణు సహస్ర నామము లు చదివి ఆకులో చిక్కుడు ఆకులు వేసి నైవేద్యం పెట్టించారు. చిక్కుడు పూలు జిల్లేడు పూలతో పూజ చేసారు. పిల్లలు చేత కూడా నివేదన పెట్టించి పరెంటాళ్ళకు వాయనం ఇచ్చి పంపారు ఛాయా ఉష సంధ్య సౌమ్య సహిత సూర్య నారాయణ స్వామి కృప అందరికీ ఉండాలని తీర్థం ప్రసాదం బ్రహ్మా గారు పంచారు. ఘనంగా పూజ అయ్యాక హరితి సమయం లో క్షీరాబ్ధి కన్యకను శ్రీ మహా లక్ష్మికి కిని నీరజా లయకును నీరాజనమ్ అంటూ శ్రీ అన్నమయ్య, శ్రీ వేంకటేశ్వర స్వామి అలిమేలు మంగ పద్మావతి సహిత శ్రీ శ్రీనివాస స్వామి హారతి పాడి అందరినీ సంతోష పెట్టింది ఆశ్వీజ.
ప్రతి ఇంటా స్త్రీ మూర్తి అన్ని తానై అంతట సదా చూస్తూ కుటుంబం చూస్తున్నారు. కనుక నేటి సమాజం ఉన్నతి గా ఉన్నది, మాఘ మాసం అంటే నోముల మాసము కలిగిన దానికి కొంత అయిన పేరంటాలు పసుపు కుంకుమ పరమాన్నం వాయనం ఇవ్వాలి స్తోమత ఉంటే రవికల బట్ట పెట్ట వచ్చును
ఇంటి పెద్దలు కూడా ఈ తరానికి తగ్గట్టు సలహాలు ఇవ్వాలి కానీ నీకేమి తెలుసు అంటూ వాదించి గొడవలు పెట్టకూడదు. అప్పుడే శాంతి శుభము ఉంటుంది. కుటుంబ వృద్ది సౌభాగ్యం కోసం ఈ పూజలు చేసి ఆయురారోగ్యాలు పొందుతారు.
ఆశ్విజ మనసు గతం లోకి వెళ్ళింది. ఆస్వీజ సిటీ లో పుట్టి పెరిగింది. ఒక్క కూతురు గారంగా పెరిగింది. తండ్రి ఉద్యోగ రీత్యా వివిధ దేశాలు వెళ్లి వచ్చేవాడు. కొంత కాలం అత్త మామ ఉన్నారు. వాళ్ళు మాకు ఇక్కడి వాతావరణం పడటం లేదు. మా ఊరు మేము వెళ్లి పోటము అన్నారు. ఇంకా తాత అమ్మమ్మ వచ్చి వీళ్ళ దగ్గర ఉండి చూసేవారు.
అలా పెద్దవాళ్ళ సహాయంతో ఆశ్వీజ పెరిగింది.
పెద్దగా తండ్రి ప్రేమ ఉండేది. కాదు ఎక్కువ భాగం తల్లి వారి ఇంటి వాళ్ళే చూసే వారు. తండ్రి దగ్గర ఎక్కువ చనువు పెంచుకో లేక పోయింది. కేవలం ఒక అతిథిగా ఉండేది. అయితే తనకి నచ్చిన వస్తువులు ఏది కావాలన్న తెచ్చి ఇచ్చేవాడు.
అలా ఒక యాంత్రిక ప్రేమ తప్ప మనసులో ఆనందం ఉండేది. కాదు ఎంతో పెద్ద ఉద్యోగము కానీ, అతనికి ఉద్యోగ రీత్యా చాలా కష్ట పడేవాడు ఒక్క పిల్ల. కావలసినంత ప్రేమ ఇవ్వలేక పోతున్నాను అని బాధ పడేవాడు.కానీ ఉద్యోగ ధర్మము తప్పదు అందుకే ఆశ్వీజ్ కి పెద్దలు అందరూ ఉండీ బాధ్యత గా చూసే కుటుంబానికి పెళ్లి చెయ్యాలని తాపత్రయ పడి పెళ్లి చేశారు. అలాగే ఆశ్విజ అన్ని బాగున్నాయి. పెద్దలు ఉండి పిల్లలని నడిపిస్తే జీవితం సుగమనమే కదా అని అనుకున్నది స్త్రీ కి కుటుంబ సభ్యుల సహకారమే ధైర్యము కదా ప్రతి స్త్రీ అలాగే కోరుకుంటుంది కూడా ఆశ్విజ పిలుపుతో వస్తున్నా అంటూ ఈ లోకంలో కి వచ్చి అత్తగారు పిలిచిన వైపు వెళ్ళింది. ప్రతి ఇల్లు నందన వనం కావాలంటే తరాల మధ్య అంతరాలు ఉండరాదు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!