ఫోటో
– బుజ్జమ్మ
నవ్వడం ఇష్టం నాకు…
అది అందంగా లేకున్నా..
హాయిగా అనిపిస్తుంది
ముఖ భంగిమలు ఇష్టం నాకు..
భావం ఏదైనా..
బాల్యం గుర్తు తెస్తుంది
తన పక్కన నిలబడటం ఇష్టం నాకు..
కష్టమైనా.. కోపంగా ఉన్నా..
తన తోడు ఉన్నదని.
ఎలాగైనా..
ఫోటో దిగడం ఇష్టం నాకు..
జతగా నవ్వుకోడానికి
ఒంటరైనపుడు బ్రతకడానికి.
***
Mee kavithalu Istam naku chadavadaniki feel avadaniki baguntayi