సాహితీ ధృవతార రావూరి 

సాహితీ ధృవతార రావూరి 

రచన :: పిల్లి.హజరత్తయ్య

Pilli hajaratthayya
అనుభవమనే ఇరుసుతో
బతుకు బండిని లాగించి
కవితా కుసుమాలు పూయించిన
సాహితీ సౌరభమతడు..!

తనకున్న కొద్దిపాటి జ్ఞానముతో
పేదల నాడిని పట్టుకుని
వినూత్న సాహితీ ప్రక్రియలతో
సాహితీసేద్యం చేసిన ఘనుడతడు..!

జీవితమనే చదరంగంలో
ఎన్నో ఆటుపోట్లను చవిచూసినా
చలించక సగటు మనిషిగా
జీవితాన్ని గడిపిన నిరాడంబరుడతడు..!

పదును తేలిన పాత్రచిత్రీకరణలతో
అద్భుత సన్నివేశ పరిచయాలతో
మనిషి ఉద్వేగాలను పండించిన
సాహితీ ధృవతార అతడు..!

బాల సాహిత్యానికి నగిషీలు దిద్ది
“జీవనసమరం” ను రుచిచూపించి
విభిన్న ప్రక్రియలలో సాహిత్యాన్ని పండించిన
కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతయతడు..!

నవ్వుతూ నవ్విస్తూ కనిపించే
సినీజీవితాలలో దాగియున్న విషాదాలను
‘పాకుడురాళ్ల’నవలలో ఆవిష్కరించి
జ్ఞానపీఠమెక్కిన సాహితీ ఉద్దండుడతడు..!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!