వేపచెట్టును నేను 

వేపచెట్టును నేను 

రచయిత :: కరుణశ్రీ

భగవంతుడు ప్రకృతికి ఇచ్చిన వరాన్ని నేను
ప్రతి దేవాలయంలోనూ నాటుతారు…
నన్ను వేపచెట్టు అంటారు..

ప్రతి గుడిలో దైవం వలె స్థానం ఇచ్చారు..
మనవాళికి ప్రకృతి అందాలలో భాగం అయి
ఆయుర్వేద వైద్యంలో ముఖ్య ఔషదమయ్యాను…

బోనాల పండుగలో నాకై వెతుకుతారు..
ఉగాది పండుగనాడు నాపూవులతో పచ్చడి చేసి
ఇంటిల్లిపాది ఇష్టంగ తీసుకుంటారు..
క్రొత్త సంవత్సరంలో భోగభాగ్యాలను ఇమ్మని అడుగుతూ

ఎండ, ఎండా అంటూ ఆగమయ్యేవారికి
చల్లని నీడని ఇస్తాను ఎన్నో పక్షులకు అవసమైన నేను
గూడు పెట్టుకుని, గుడ్లు పెట్టే పక్షి జాతిని
అంతరించిపోకుండా కాపాడుతున్నాను

ఆకులు రాల్చి, కాయలు ఇచ్చి ఎరువుగా మారి
పంటలకు కీడలనుంచి రక్షణనిస్తూ
రైతన్నలకు వెన్నుదన్నునైయ్యాను…

ప్రతి ఇంటిముందు నేనుండి ప్రాణవాయువునిస్తున్నాను
పసిపిల్లలాడుకోవటానికి ఒడిని ఇస్తూ
అమ్మలా ఆలవాలమయ్యాను…
వేపచెట్టును నేను …
మనవాళిని కాపాడేతందుకు వచ్చిన దివ్య దేవతను నేను..!

హు! అయినా నన్ను ఎప్పుడూ తిట్టుకుంటూ ఉంటారు
పూవు రాలి, ఆకు రాలి, పుల్లా రాలింది మీ వేపచెట్టుది
మా వాకిలి అంతా నిండిపోయి చెత్తగా అవుతుందని
ఒకటే గొడవలు పక్కింటి వాళ్ళు…
నా నుంచి వచ్చే చల్లని గాలి మాత్రం వాళ్ళకు కావాలి!

ఏమిటీ ఈబాధ! ఎందుకీ అనిశ్చిత? ఎందరో..
“నువ్వు వొద్దు” నీ నుంచి అవసరం కన్నా
అనవసరపు బాధలే ఎక్కువయ్యాయి..” అంటూ
దిన దినమూ నన్ను క్షోభ పెడుతున్నారు…
నా జీవనానికి రక్షణ కొదవయిందనే ఆత్మక్షోభ నాకెందుకు?
ఎందుకు?…నాకెందుకు?

నేను చేసే సేవ నిస్వార్ధం, అది తెలుసుకోలేరు ఈ మానవలోకం
ఎప్పుడు అర్థం చేసుకుంటారో…? నన్ను
జీవమున్న ప్రాణిగా గుర్తించి తమలో కలుపుకుంటారో?
ఒక పూజనీయమైన దేవతా వృక్షం ఈ వేపచెట్టు అని
ఎవరు ఎప్పౌడు గుర్తిస్తారో… నన్ను వరంగా భావించి
నా నుంచి వచ్చే స్వచ్చమైన గాలిని అందుకుంటూ
ఆయువు పెంచుకుంటూ…
నన్ను తలుచుకుంటూ మురిసిపోయే రోజు
అసలు వస్తుందా…!
ఎప్పుడు.. ఎలా.. ఎవరు..అంటూ అన్నీ ప్రశ్నలే…!
**

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!