ఉత్కృష్టమైన రంగును నేను.!( స్వగతం)

ఉత్కృష్టమైన రంగును నేను.!( స్వగతం)

రచన::పిల్లి.హజరత్తయ్య

Pilli hajaratthayya

ఇంద్రధనస్సులోని రంగునై
ఇలలోని కాంతల మనసును దోచినాను

తెలుగువారి పసందైన వంగపండుకూరనై రుచిచూపించినాను

డిసెంబరు పూలు రంగునై
స్త్రీల మనసులనుకట్టిపడేసినాను

పగడపు కాంతులలో వర్ణమునై
మనుషుల సౌందర్య లేపనమై మెరిసినాను

సూర్యభగవానుడికి అత్యంత ప్రీతిపాత్రమై
ఆయన వాహనపు రంగనై అలరారినాను

ధ్యానము, క్రతువుల చేయు
సమయాన ఊదారంగు జ్వాలగా కొలవబడి
ఆధ్యాత్మిక జీవనానికి బాటలు వేసినాను

అనుకూల ఆలోచనలకు దర్పణమై
తెలివి తేటలకు తార్కాణంగా నిలిచిన
ఉత్కృష్టమైన రంగును.. అందరిని మెప్పించినదానను.. నేను…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!