సగటు ప్రైవేటు ఉద్యోగి

సగటు ప్రైవేటు ఉద్యోగి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: బాలపద్మం

భానుడేతెంచక ముందే లేచి
సత్తువ తెచ్చుకుని పరుగులు
వగర్చుకుంటూ ఉరకలు
చంకనేసుకుని కేరేజీలు
బస్సుల్లోనో లేదా బైకుల్లోనో
చక్రబంధాల ట్రాఫిక్కులు దాటి
సమయానికి ముందే
చేరి తీరాలి కొలువు
దివాకరుడు సేద తీరిన
తరువాత తిరుగు పయనాలు
నిస్తేజంతో అలసట మిగిలేది
అణువణువూ విశ్రాంతి కోరేది
నిత్యం ఇదే కురుక్షేత్ర సంగ్రామం
అయినా తప్పని సమరం
వివరించినా ఓ పరి ఆలోచించి
కష్టమనుకుంటే కష్టమే మరి
ఇష్ట పడి ఇష్టమను కోవడమే మరి
లేదంటే బ్రతుకునడక సాగదుగా మరి

You May Also Like

17 thoughts on “సగటు ప్రైవేటు ఉద్యోగి

  1. సగటు మెట్రో జీవి జీవన విధానం చక్కగా వివరించారు

  2. సగటు ఉద్యోగి జీవితాన్ని బాగా వివరించారు

  3. కలం కి పదును పెట్టి రాశారు గా మరి… చాలా బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!