చిన్నప్పుడు అమ్మమ్మమింట్లో
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: అనిత
“ప్రియమైన మీ కోడలు ఉత్తరం రాయునది ఏమనగా ఇక్కడ మేము అందరం బాగున్నాం”. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మా అత్తయ్య వాళ్ళింట్లో ఎంతో సంబరంగా దీపావళి జరుపుకుంటున్న. నాకు అమ్మమ్మ, తాతయ్య చేసే లక్ష్మీ నోములు బాగా గుర్తొస్తుంటాయి. “దీపావళికి మూడు రోజుల ముందు నుండే అమ్మమ్మ పండగ వాతావరణం ఆ హడావిడి అంతా ఇంతా కాదు” ప్రొద్దున నాలుగు గంటల నుండే రంగురంగుల ముగ్గులు, తీపి వంటకాలు, సాయంత్రం అందరికీ భోజనాలు చేసేది. లక్ష్మీ దేవికి హారతుల, పాటలు. చిన్నపిల్లల మా తోటి కాకర వత్తులు కాల్చేది. ఆనందంగా అందంగా అలంకరించుకునేది అవన్నీ గుర్తుకు చేసుకుంటూ మీకు పంపుతున్న నా ఉత్తరం.
ఇట్లు
మీ కోడలు అనిత.