అది జీవితం కాదు
రచయిత: సుజాత తిమ్మన
బుద్ది కలిగిన భాగ్య జీవి
మాటలు చెపుతూ
విషయాలను తెలుసుకోగల
ధన్య జీవి మనిషి
ఆ బుద్దిని స్వార్ధానికి వాడుకుంటూ
తన సుఖం, సౌఖ్యం కోసం
ఇతర ప్రాణులను బలిచేసే వాడు
మానవుడయినా రాక్షసుడే
ఇవ్వటమే కానీ తీసుకొవటం
తెలియని, తమంతట తాముగా
అడవుల్లో పెరిగే వృక్షాలను నరికేస్తూ
నగరాభివృద్ది చేస్తున్నారు …
ముడిపడిన బంధాలను చిక్కులుగా భావించి
ఏకాకి జీవితాలకు అలవాటు పడుతున్నారు
వచ్చేటప్పుడు ఒంటరే మానవుడు
కానీ పోయేటప్పుడు నాలుగురుండాలి
ఎలా అయినా బ్రతికేస్తాం!
మాకేంటి? అనుకుంటే అది జీవితం కాదు
ప్రకృతిని ప్రేమించాలి పర్యావరణాన్ని రక్షిస్తూ
సాటిజీవులను కాపాడుకోవాలి మానవజన్మున్నందుకు!