నీపై నా ప్రేమ

నీపై నా ప్రేమ
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: శ్రీమతి నందగిరి రామశేషు

నీపై నాప్రేమ చినుకులా మొదలై
మేఘాల నుండి జారిన వర్షపు ధారలై
పుడమిని తాకిన నదిలా పొంగి వరదలై
నీమదిని చేరె, కడలిని కలిసిన నదియై
ఎద నిండిన నీ తీయటి తలపులని
గుండె గూటిలో పదిల పరచుకొని
మదినిండా భావాలను ప్రోది చేసుకొని
ఆశతో నీ రాకకై నేనిట వేచియుంటిని
ఆశనిరాశల ఊగిసలాట తెసినా కష్టమని
తెలిపింది ఆ కష్టం నువ్వెంతో ఇష్టమని
నీ రాకతో నామది పరవశించి పోయె
నీ పిలుపు విని తనువు కంపించి పోయె
నీ ఎదుటకు రావాలన్న కలవరమాయె
నీ ఎదుట పడగానె కన్నులు వాలిపోయె
ప్రేమ నిండిన చూపుల నను కాంచినంతనే
తనువంత సిగ్గుతో ముకుళించి పోయెనే
నను పట్టి నీ కౌగిట బంధించి నంతనే
లోలోన ఆనందము పొంగి పొరలెనే
మృదు మధుర మాటలతో జయించె
నాలోని బిడియమును తొలగించె
నన్ను తన వశురాలిని గావించె
నా మదికి సంతసము ‌నందించె
ఆతని రాకతో చీకటి వెలుతురాయె
కలలన్నీ ముంగిట సాకార మాయె
మది నిండిన ఆశలు వెల్లువై పోయె
నా జీవన గమనమే‌ మారి పోయె

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!