ఇద్దరిది ప్రేమే కదా బావ

ఇద్దరిది ప్రేమే కదా బావ

రచన:: జయ

ఆగు బావ.
ఆగు బావ నిన్నే ఓయ్ ఆగు.
మాట్లాడాలి ఆగు.
హా చెప్పు పిల్ల,ఎందుకే అలా అరుస్తున్నావ్.
చెప్పు త్వరగా నేను వెళ్ళాలి.
ఎక్కడికి వెళ్తావ్ బావ.
ఎక్కడికి వెళితే అక్కడికీ.
తిక్క సమాధానాలు చెప్పకు నాకు మండుతుంది.
ఎక్కడే ,నీకే కాదు నాకు మండుతుంది.
ఎందుకు బావ నన్ను పెళ్ళి చేసుకోమని ఆడిగినందుకా.
మరి చేసుకోవచ్చు కదా బావ.!
నిన్నా పెళ్లా హా.హా.
ఏ బావ నేను పెళ్ళి చేసుకోడానికి పనికి రానా.!
ఏ బావ నేను అందంగా ఉండనా.
నేను నిన్ను అత్తని బా చూసుకొనా.
నేను చదువుకోలేదు అనా.
నా దగ్గర డబ్బు లేదు అనా.
లేక నేను మంచిదాన్ని కదా అన్నా మాట పూర్తి కాకా ముందే సీత కళ్ళ లో నీళ్లు చూసి సీత.
నన్ను క్షమించు పిల్ల.
నేను ఆ ఉద్దేశం తో అనలేదు.

ఏవేవో కలలు కన్నా .
ఏవేవో పూజలు చేసా నీ కోసం.
చిన్నప్పటి నుంచి వీడు నీ మొగుడు అంటుంటే నిన్నే నా జీవితం అనుకున్నా.
నీ కోసం నా చదువు ,నా భవిష్యత్తు ఏమిటో కూడా ఆలోచనే ఉండేది కాదు.
నాకోసం కార్చుపెట్టే డబ్బులు కూడా నా బావ కోసం ఖర్చు పెట్టమని నాన్న ని బ్రతిమలాడేదాన్ని.
నా బావే కదా ,నా కోసమే కదా అనుకునేదాన్ని.
నా ప్రపంచమే నువ్వు కదా బావ.
అవును నా తప్పే నిన్ను పై చదువులకు వెళ్లొద్దు అని అందరు అంనువుంటే నేనే వినలేదు నా బావ కదా నా కోసమే కదా అనుకున్నా.

అది కాదే .
ఏది కాదు బావ.
నేను చెప్పేది విను పిల్ల .
చెప్పు బావ .!
నేను చదువుకునే టప్పుడు ఒక అమ్మయి ని ప్రేమించాను. తనని తప్ప నా పక్కన ఎవరిని ఊహించుకోలేను అర్ధం చేసుకోవే.
మరి నేను బావ.
నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నిన్ను తప్ప వేరే వాళ్ళని కళ్లతో కూడా చూడలేదు.
నా ఊపిరి నువ్వు బావ.
నా ప్రాణమే నువ్వు.
హ్మ్మ్ తెలుసు పిల్ల.
మరి ఎందుకు బావ నువ్వు ఇలా చేస్తున్నావ్.
నేనేమి చెయ్యను అది ప్రేమే.
ఎవరిమీదా ఎప్పుడు పుడుతుందో తెలియదు.
నాకే తెలియకుండా నే ఇది అంతా జరిగిపోయింది.
ప్రేమ కి వీళ్ళని వరించాలి,వీళ్ళ జోలికి వెళ్ళా కూడదు.
ఈ వయస్సు లో ప్రేమించాలి,ఒక్కరినే ప్రేమించాలి అని ఉండదు.
ప్రేమకి హద్దులు, ఆంక్షలు ఉండవు.
మనస్సుని ఏ దరికి చేరుస్తుందో తెలియదు కదా అందుకే నా మనస్సును ఆ ప్రేమ నుచి తప్పించలేక పోయానే.
ఈ జన్మకి ఇంతేనే.
అలా అంటే ఎలా బావ.
ఆ అమ్మయి కి పెళ్లి అయ్యిపోయింది అంట కదా బావ.
నిన్ను వదిలిన ఆ అమ్మాయి కోసం. ఇంత మందిని బాధ పెడతావ చెప్పు.
అత్తయ్య, నాన్న,నాన్నమ్మ ,అందరూ నీ గురించే కదా బాధ పడుతున్నారు.
అత్తయ్య ఆరోగ్యం బాలేదు కదా.
ఈ సమయంలో తనని బాధ పెట్టడం అన్యాయం బావ.
నేను చేసేది ఏమి లేదు పిల్ల.
సరే బావ నేను ఒకటి చెబుతా వింటవా.!
చెప్పు .
అది కాదు నీకు నేను అంటే ఇష్టం లేదు అంతేనా.
అది కాదే. హ్మ్మ్ తెలుసు బావ.
నేను మన ఇద్దరికి మేలు జరిగే ఐడియా చెబుతా ఒక సారి ఆలోచించు.
ఏమిటి అది.
ఇంట్లో వాళ్ళు అందరూ మన పెళ్లి చూడాలని కోరిక అంతేనా.
నీకు ఆ అమ్మయి తప్ప వేరే అమ్మయిని చేసుకోవు అంతే గా.
నేను కూడా నిన్ను తప్ప వేరే వాళ్ళని చేసుకోలేను.
నువ్వు పెళ్ళి చేసుకోకుండా వుండే కంటే.
నన్ను పెళ్ళి మాత్రమే చేసుకో నాకు దగ్గర అవ్వకరలేదు. నీకు నా మీద ప్రేమ పుట్టే వరకు నేను నీ కాజోలికి రాను.
ఇలా చేస్తే మనం ఇద్దరం సంతోషంగా లేక పోయినా, కనీసం ఇంట్లో వాళ్ళు అయిన సంతోషం గా వుంటారు.
ఆలోచించు బావ.
ఈ పెళ్ళి జరిగిన తరువాత నువ్వు నా కోసం ఏమి చెయ్యక్కరలేదు.
నేను నీకు వంట చేసి పెడతా.
రోజులో ఏదో ఒక టైం లో తిన్నవా అని అడుగు చాలు ఆ మాటే నాకు పరమానందం.
ఇంట్లో వాళ్లనందరిని నా కంటికి రెప్పలా చేసుకుంటా.
నువ్వు నాకు వంట్లో బాగోక పోతే ఎలా ఉంది అని అడుగు చాలు,ఒక మందు బిళ్ళ తెచ్చి ఇవ్వు చాలు అదే కోటి జన్మల పుణ్యం అనుకుంటా.
ఈ పెళ్లి వల్ల నీకు వచ్చే నష్టం ఏమి ఉండదు బావ .
ఇంకా మేలు జరుగుతుంది.
మరి నువ్వు అని అడిగిన రామ్ కి సీత చెప్పిన సమాధానం విని కన్నీరు ఆగలేదు.
ఏమి లేదు బావ.
నాకు నువ్వు అంటే పిచ్చి ప్రేమ.
ప్రాణం.
నేను నిన్ను చూస్తూ ఉంటే చాలు ఈ జన్మకి నేను నీ నుంచి నేను ఏమి ఆశించాను.
నిన్ను చూస్తూ. ఈ జీవితం ఇలా గడిపేస్తా.
అప్పుడు రామ్ మనస్సు కరిగి
సీతను పెళ్లి చేసుకొని happy గా వుంటారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!