రేపటి సీతాకోక చిలుక!

రేపటి సీతాకోక చిలుక!

-బి హెచ్ వి.రమాదేవి

గొప్పోళ్ళ ఇల్లులా ఉంది. అంతాసందడే ,తోటకు నీళ్ళు పెట్టేవాళ్ళు, వంటవాళ్ళు, క్రోటన్స్ మొక్కలు కత్తిరించే వాళ్ళు,ఇల్లు తడి పెట్టే వాళ్ళు ,సోఫాలు దులిపే వాళ్ళు,అస్ ఇంటి పుణ్యమా అని చాలా మంది బతుకు తున్నారు.. ఇంటి యజమాని పరిమళమ్మ అందరికీ పనులనుపురమాయిస్తుంది.ఇంతలోఅక్కడికి…
నీలి .వచ్చింది.
“అమ్మ సబ్బు అయిపోయింది. ఇప్పించరూ,! ”
ఆ ఇంట్లో పనివాళ్లని పరిమళ బిడ్డలు లాగే చూస్తుంది.కానీ
నీలి అమ్మ , అంటుంటే తాను దానికి ఏ జన్మ లోనో తల్లినేమో ననిపిస్తుంది.తన కూతురి వయసున్న నీలి దాని చిన్నప్పుడు చినిచిన్ని చేతులతో బండెడు అంట్లు,
తోముకుంటే చాలా బాధ కలిగేది, కానీ అత్తగారికి జడిసి నోరు మెదపలేదు. అది చాలా.తెలివైనది.పండుగకు పట్టు లంగా కొనుక్కుంటావా అని అడిగితే, లేదు పుస్తకాలు కొని పెట్ట మంది.తన కూతురి కంటే సంవతరం జూనియర్ .అందుకే అవి దానికి ప్రతియేటా ఇచ్చేది తను. ఆలాగే పొట్టయిన బట్టలు కూడా!
“అమ్మా! ఏమిటీ ఆలోచిస్తున్నారు.!? నీలి కలువలా నవ్వుతూ అన్నది.
రక్షా! స్టోర్ రూం లో వశిగ్ సొప్స్ రెండు తెచ్చివ్వు!”
పరిమళ కేక పెట్టింది.
“ఫో! మమ్మీ! ఆ గొంగళి పురుగుకు అప్పుడే తెల్లారిందా! యేమిటి? తననే తెచ్చుకోమను” విసుగ్గా అంది కూతురు.
రక్షకు దానిని చూస్తేనే వళ్ళు మంట,తను వేసుకున్న బట్టల్లో దానిని చూస్తే తన కల లను లాక్కునే కట్ల పాములా, ఇంటికి పెట్టిన దిష్టి బొమ్మలా ఉంటుంది.ముఖ్యంగా ముందు ఆ కళ్ళు, పళ్లు చూస్తుంటే అసూయ.ఏమితింటుందో! అస్ మెరుపు తనకు లేదు.తను తెల్లగా వున్నా , అది నల్లగా వున్నా అదే కళగా ఉందని ఫ్రెండ్స్ అంటుంటే మనసు కుతకుత వుడికే మైదా పిండి లా అవుతుంది.
“నీలి వెళ్లి తెచ్చు కో మ్మా!”
“అమ్మ కాదు,అమ్మ గారు అను.నువ్వు అపిలుపిలుస్తుంటే నీకూ,నాకూ,అమ్మ ఒకటేను అన్నట్లు ఉంటుంది.'”కోపంగా అన్నది
“అలా నేనెప్పుడూ ఆశపడను అమ్మాయిగారు.! బాధగా తలదించుకుంది.
“అలాంటి కూతురు పుట్టాలంటే పెట్టీ పుట్టాలి”పరిమళ కూతురి వైఖరి తెలిసి మనసులో అనుకుంది. పనయ్యాక. …
*అమ్మా! రేపటి నుండి నేను
పనిలోకి రాలేను. అమ్మమ్మ దగ్గరకు వెళుతున్నాం.
అక్కడే ఉంటాను
“అయితే ఇక రావా!ఇదిగో నాకు బిగుతైన డ్రెస్సు లు”
సంతోషం పట్టలేనట్లు అన్నద్ది.
ముందు ఓ. బిగ్ షాపర్ పడేసింది .
నీలి మళ్లీ పున్నమిపవ్వు పూసినట్లు నవ్వింది.నీకు. ఎప్పుడేం కావాలన్నా ఒక్క ఫోన్ చెయ్యి! తల నిమురుతూ అన్నది.

*****

పదేళ్లు గడిచాయి.కూతురు ఇంజినీరింగ్ చదివింది.అల్లుడు కూడా సాఫ్టు ఇంజినీర్!ఇం తలో ఓ స్వచ్ఛంద సేవా సంస్థ వృద్ధులకు,బట్టలు పంచడానికి తనను పిలిచారు.సామాజిక కార్య క్రమాలు తను విరివిగా చేస్తుండడం గమనించి , కలెక్టర్ గారిని తను రిసీవ్ చేసుకునే టట్లు,తన కూతురు ర క్ష దండ వేయడానికి…
అంత రంగు రంగుల తోరణాలతో అలంకరించారు.కలెక్టర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.దేవర దిగి తలుపు తీసాడు. జాలీ ముడితో,కూలింగ్ గ్లాసెస్ తో నున్న ఓ యువతి దిగింది.ఆమె వెంట సెక్రటరీ, రక్ష్ మెడలో దండ వేసింది.ఆమె.కలెక్టర్ కళ్ళ జోడు తీసి అమ్మపాదాలకు నమస్కరిస్తుందినవ్వుతూ…
ఆనవ్వెక్కడో ఇంకెక్కడో .చూడినట్లుంది.గొంగళి పురుగు కదూ;! ఎస్! అదే నవ్వు,అస్ చామనచయ రంగు నేడు ఎరుపయ్యింది.వంటికి ఆ పదవి మెరుపయ్యింది.అప్పటి గొంగళి.పురుగు కృషితో నేడు రంగుల.సీతాకోక చిలుక లా,
రమణీయంగా మెరిసి పోతుంది. కలలకు రెక్కలొచ్చి,
అందరి మధ్యలో ప్రత్యేకంగా…
ఆలోచిస్తున్న రక్ష భుజం పై చెయ్యి పడింది.రక్ష గారూ!
అమ్మాయి గారూ! అనే నోరు లిప్స్టిక్ పెదవుల మధ్య పళ్లు మెరుస్తుంటే..ఎక్కడో వున్నట్లు
వూ! చెప్పు! అహ! చెప్పండి
అన్నది.సీతాకోక.చిలుకను..
ఆశ్చర్యంగా చూస్తూ….

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!