పెద్దల చెంత-ఉండదు చింత

(అంశం: చందమామ కథలు)

పెద్దల చెంత-ఉండదు చింత

రచన: పద్మజ రామకృష్ణ.పి

ఆ ఊర్లో రవి ఒక RMP డాక్టర్..తల్లిదండ్రులకు ఒక్కడే సంతానం రవి…రవికి పెళ్లై పదేళ్లు దాటింది ఇంకా సంతానం కలగలేదు,..తనక్లినిక్ కి వచ్చే చిన్నపిల్లలను చూసి చాలా
బాధపడుతుండేవాడు రవి..భార్య రాధిక కూడా పిల్లల కోసం మొక్కని మొక్కులేదు ఎక్కని కొండ లేదు..రవి తల్లిదండ్రులు కూడా  మనవ సంతానం కోసం తెగ ఆరాటపడుతుండేవారు ఎప్పుడెప్పుడా అని..

ఏ దేవుడు వరమిచ్చాడో రాధిక నెలతప్పింది..
ఆ ఇంట సంతోషాలతో సంబరాలు జరుపుకున్నారు..
రాధికని అడుగు కింద పెట్టకుండా చూసుకున్నారు
ఇంట్లోవాళ్ళు..నెలలు నిండి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది రాధిక..ఎంతో అపురూపంగా పెంచసాగారు ఆ పాపని..

ఇప్పుడు ఇంటి ఖర్చులు పెరుగుతాయి కాదండీ.!మీ అమ్మా,నాన్నవాళ్ళను వేరే ఉండమని చెప్పండీ. అని రవితో చెప్పింది రాధిక..తనకు ఎప్పటి నుండో వాళ్ళతో కలిసిఉండడం ఇష్టం లేదు రాధికకు ఇప్పుడు ఈవంక అనుకున్నాడు మనసులో రవి..రాధిక పదేపదే ఇదే విషయం చెప్పడంతో. రవి తల్లిదండ్రుల దగ్గర భార్య వ్యక్తిత్వాన్ని తక్కువ చెయ్యలేక” తనే క్లినిక్ దగ్గరగా ఇల్లు తీసుకుంటాను అనిచెప్పి వేరే ఇల్లు మారాడు..

పాపకి మోహిత అని నామకరణం చేశారు..ఇప్పుడు మోహితకు ఆరోనెల…రాధిక చేతిలో మెహిత నిద్రపోతుండగా కరెంటు పోయింది..మెల్లిగా మోహితని కింద ఉన్న చాపమీద పడుకోబెట్టి క్యాండిల్ వెలిగించి తిరిగి మోహితని మంచంపై
పడుకోబెట్టింది…

“ఆ కాసేపటికే మోహిత గుక్కపెట్టి ఏడవడం మొదలు పెట్టింది” రాధిక ఎంత సముదాయించిన ఏడుపు ఆపడం లేదు..ఎంత సేపటికి
మోహిత ఏడుపు ఆపడం లేదు..ఇంటిపక్క ఉండే వాళ్ళు కూడా అందరు వచ్చారు..ఎవరివల్ల కాలేదు మోహిత ఏడుపు ఆపడం..గుక్క ఆగిపోయింది.. ఏమైందో అని రాధిక కూడా ఏడవడం మొదలు
పెట్టింది..

ముందు పిల్ల ఒంటిపై ఉన్న స్వెటర్ తియ్యండి అన్నారు అక్కడ ఉన్నవాళ్లు..స్వెటర్ తియ్యడంతోనే మోహిత చంకలో నుండి మండ్రకప్ప కింద పడింది.. అప్పటికే మోహిత కాళ్ళు చేతులు
చల్లపడిపోయాయి…జరగవాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది”మోహిత చనిపోయింది..

రవి బిడ్డను గుండెలకు అద్దుకుని చిన్నపిల్లాడిలా
ఏడుస్తున్నాడు..రవి తల్లిదండ్రులు వచ్చారు.. “భగవంతుడా ఏంటి మాకి పరీక్ష.!వరం ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నావా..!అభంశుభం ఎరుగని పసిదాని బదులు మమ్మల్ని తీసుకుపోవచ్చు కదా.!అని రవి తల్లిదండ్రులు బోరునవిలపించారు..

అక్కడకి వచ్చిన ఇరుగుపొరుగు వాళ్ళంతా” పిల్ల కాస్త ఎదిగేవారకు పెద్దవాళ్లల్లో ఉండాల్సింది.అప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు
ఉండవు కదా.!చూడు ఇప్పుడు ఏం జరిగిందో అని కొందరు..అయినా పిల్లకు అంతవరకే ఆయువు పెట్టాడు భగవంతుడు,అని కొందరు అనుకుంటూ ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు..

రోజులు గడుస్తున్నాయి’రవి పిల్లను మర్చిపోలేక పోతున్నాడు..క్లినిక్ కూడా
సరిగ్గా తియ్యడం లేదు ఏదో పరధ్యానంగా ఉంటున్నాడు..రవి వాలకం చూసి రాధిక మనసు మరింత భారంగా మారింది..అటు పిల్లను మర్చిపోలేక,ఇటు భర్తను అయోమయ స్థితిలో చూస్తూ తట్టుకోలేకపోతుంది..

“వరండాలో పరధ్యానంగా ఉన్నాడు రవి”..ఏమండీ
అంది రాధిక” పలకలేదు రవి..ఏమండీ అని మరోసారి పిలిచింది..ఏంటి అన్నట్లుగా చూసాడు రవి…మీ అమ్మ వాళ్ళను రమ్మని చెప్పనా.!అంది..
ఎందుకు అన్నాడు?రవి..పోనీ మనమే పోదామా.? అంది మరల..మౌనం వహించాడు రవి”

రాధిక”కంటి నిండా నీళ్లు పెట్టుకుని”నాకు పిల్ల మరపురావడం లేదు,మీరు చూస్తే ఇలా,నాకు
బ్రతకాలని లేదు..నేను ఇలాంటి ఆలోచనలు నుండి బయటపడేవారకు కొన్ని రోజులు నువ్వు నేను
మీ అమ్మ వాళ్ళతో కలిసి ఉందాము అంది..

రాధికని దగ్గరగా తీసుకున్నాడు రవి”నిండా పది మాసాలు మోసి కన్నావు..భగవంతుడు కడుపులో ఉంచ్చినన్ని రోజులు కూడా భూమిపై బిడ్డను ఉంచలేదు..ఆరునెలల బిడ్డ దూరం అయితేనే మనకు మరణాన్ని తలపిస్తుంది రాధిక” అదే పెద్దయ్యాక పెళ్ళై వెళ్ళిపోతే మనం తట్టుకోలేము అని భగవంతుడు బిడ్డని ముందే తీసుకుపోయాడు అనుకుంటా!అన్నాడు భార్య తల నిమురుతూ…

కొన్ని రోజులు తరువాత మాట్లాడిన భర్త మాటలు విని కాస్తంత ఓదార్పు అనిపించింది రాధికకు..మరల అడిగింది,వెళదామండీ అత్తయ్య వాళ్ళ దగ్గరకు అని..

ఇప్పుడు నేను సరిగ్గా క్లినిక్ కూడా కొన్ని రోజులు వరకు తియ్యలేను రాధిక,ఖర్చులు గురించి కూడా ఆలోచించు కొద్దిగా అన్నాడు…

అత్తయ్యవాళ్ళు అక్కడ అద్దె కడుతున్నారు, మనం ఇక్కడ అద్దె కడుతున్నాము రెండు అద్దెలు బదులు ఒక్కటే అద్దె అవుతుంది కదండీ.!అంది మరల..

భగవంతుడు మనకు చేసిన అన్యాయం తెలుసుకుని మరల బిడ్డల్ని ఇస్తే.!అప్పుడైనా ఖర్చులు పెరుగుతాయి కదా.! అన్నాడు రవి..

రాధికకు అర్థం అయ్యింది..ఆరునెలలు పెంచిన బిడ్డ దూరమైతేనే తట్టుకోలేని నేను.పదేపదే కొడుకుని దూరం చేసుకోలేరు రవి తల్లిదండ్రులు అందుకే ఇలా చెబుతున్నాడు రవి”నేను చేసిన తప్పు ఇప్పటికి కూడా ఎంచకుండా నాపై ఇంకా ప్రేమను చూపుతున్నారు,అదే నేను వేరే రాకుండా ఉండి ఉంటే.!తల్లిదండ్రుల ప్రేమ రవికి దూరం అయ్యేది కాదు,నా బిడ్డ కూడా నాకు దక్కేది అనుకుంది రాధిక..

నన్ను క్షమించండి నేను చేసిన తప్పు వలనే ఇదంతా జరిగింది”అత్తయ్య వాళ్ళ దగ్గర నేను ఉండి ఉంటే కరెంట్ పోయినప్పుడు పిల్లని నేలపై పడుకోబెట్టె అవసరం వచ్చేది కాదు.!ఇలా జరిగేది కాదు.. మిమ్మల్ని మీ తల్లిదండ్రులకు దూరం చేశాను కాబట్టి మన బిడ్డను కూడా భగవంతుడు దూరం చేశాడు… మరల దేవుడు కరుణించి బిడ్డల్ని ఇస్తే పెద్దల సమక్షంలోనే పిల్లలు పెరిగే అదృష్టాన్ని కల్పించి,వారి అడుగుజాడల్లో పెంచి పెద్దచేస్తాను అని భర్తకు మాట ఇచ్చింది రాధిక…

రవి..భార్యను తల్లిదండ్రుల దగ్గర చులకన చెయ్యక, భార్య ఖర్చులు గురించి చెప్పిన వంకను మనసు లోనే పెట్టుకుని.తనపై పెట్టుకుని క్లినిక్ దగ్గరగా ఉండాలి అని చెప్పాడు తప్ప భార్యని పలుచన చెయ్యలేదు..తల్లిదండ్రులకు భార్య దగ్గర విలువ పెంచి వాళ్ళ విలువలు భార్య తెలుసుకునేలా ప్రేమగా చెప్పాడే తప్ప ఎక్కడ సహనం కోల్పోలేదు..
పెద్దల చెంత ఉంటే పిల్లలకు ఎలాంటి చింత ఉండదు అని చెప్పకుండానే తెలియచేశాడు రవి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!