అమ్మ

(అంశం: చందమామ కథలు)

అమ్మ

రచన: చెరుకు శైలజ

ఒక ఊరులో రామయ్యా సీతమ్మ దంపతులకు ఉండేవారు.వారీకి ముగ్గురు కొడుకులు.ఊరులో వ్యవసాయం చేసుకుంటు  కొడుకులను మంచిగానే చదివించారు . పెద్ద కొడుకు రమేష్ చదువుకోని టీచర్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కొడుకు సురేష్ చదువుకొని బస్ కండక్టర్గా ఉద్యోగం చేస్తున్నా డు
చిన్న వాడు గణేష్ చదువు అబ్బాక ఊరులో తల్లి దండ్రులకు సహాయంగా వ్యవసాయ పనులు చేసేవాడు. ముగ్గురి కొడుకుల  పెళ్లిళ్లు అయ్యాయి.
రామయ్య అనారోగ్యంతో మరణించాడు.   పొలం పనులను చూసుకోవడం గణేష్ చేసేవాడు. మిగితా ఇద్దరు కొడుకులు తల్లినీ  పనికి ఆసరా ఉంటుంది అని తీసుకొనిపోయేవారు . కొన్నాళ్ళకు సీతమ్మ మరి చేతకాకుండ అయ్యేసరికి  తల్లిని తమ్ముడి దగ్గరే వదిలారు.ఏం విషయం పట్టించుకునేవారు కాదు.గణేష్ అతని భార్య లక్ష్మి సీతమ్మ ను చంటిపిల్లలాగా చూసుకునేవారు .మంచంలో పడుకొని సీతమ్మ బాధపడేది .అందరి కొడుకులను ఒకే తీరుగా పెంచాను  .మరి వాళ్ళు ఎందుకు  తల్లి అంటేనే పట్టింపు లేనట్లే ఉంటున్నారు అనుకుంటు ఉండేది.ఒకరోజు ఆరోగ్యం బాగా  క్షీణించడం వలన మిగితా ఇద్దరు కొడుకులను కూడా రమ్మని కబురు చేయమని గణేష్కి చెప్పింది.  కొడుకులు వచ్చారు. అందరిని  దగ్గర కూర్చో పెట్టుకొని  నేను  ఇక బతుకను పోయేముందు ఒక మాట నా భారం అంతా చిన్న వాడి మీదే వేశారు. అయిన వాడు ఒక మాట అనకుండా నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. మీరు మీ అవసరాలకు నేను బాగున్నాపుడే తీసుకపోయారు .ఇది మీకు తగునా రేపు మీ పిల్లలు ఇలాగే  చేస్తే మీకు ఎలా ఉంటుంది. నా బంగారం ,ఈ ఇల్లు ఉన్న పొలం అంతా గణేష్ కే చెందుతుంది. నాయనా గణేష్ లక్ష్మి ఇలా రండి అంటు తన పెట్టే తీయమని అందులో ఉన్న బంగారు కడియం కోడలు చేతికి ఇచ్చింది. అందులో ఉన్న భూమి తాలుకు కాగితాలు కొడుక్కి ఇచ్చింది ఎందుకమ్మా ఇప్పుడు ఇవి అన్ని  నీవు బాగుంటే చాలు అన్నాడు. ప్రతి తల్లికీ నీలాంటి ఒక కొడుకు ఉంటే చాలు .ఆ తల్లి ఎంతో అదృష్టవంతురాలు  అంటు కొడుకును చూస్తు కన్ను మూసింది. మిగితా కొడుకులు కోడళ్ళు వారి తప్పును తెలుసుకోని   తల్లిని క్షేమించమని మీద పడి ఏడ్చారు.అందుకే తల్లిని మించిన దైవం లేదు.  చిన్నప్పుడు మనల్ని అమ్మ ఎలా చూసుకుంటుందో మనం కూడా అమ్మని అలా చూసుకోవాలి

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!