అనాథ బాల్యం

 అనాథ బాల్యం

రచన::విజయ మలవతు

ప్రపంచమెంత మారినా
నాయకులెంత ఏమార్చినా
వారి బ్రతుకులు మారునా
కొత్త వసంతాలు వచ్చేనా..

పాపం పుణ్యం తెలియని చిన్నారి
జీవితాలను ఎవరి స్వార్ధానికో
బలి చేస్తూ అనాధల్లా
ఎవరి పాపానికి ప్రతిరూపాలో..

లోకం పోకడ తెలియని జీవితాన
వీధి బాలల అవతారంలో
విధి ఆడే వింత నాటకంలో బలవంతంగా తోసివేయబడిన నాసి రకం బతుకులా వారివి..

ఛీత్కారాలతో చీదరింపులతో
తెలిసి తెలియని బ్రతుకులతో
వేదనాభరిత దీనావస్థ
వీధి బాలలదే..

పచ్చని బాల్యం మాడి మసై పోయి
ఎప్పటికి గాడిలో పడేను
అసలు కొత్త జీవితమంటూ ఉండేనా
వీరి బ్రతుకు పయనంలో…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!