మార్పు

మార్పు 

రచన::నామని సుజనాదేవి

పాత అలవాట్లే ప్రాణం పోస్తున్నాయిప్పుడు
పూర్వీకుల మాటలే వేదాలయినాయిప్పుడు

అమ్మ కాచిన కషాయమే కంఠానికి శ్వాస అయ్యింది
కాళ్ళు కడిగి ఇంట్లోకి రమ్మన్న నాన్న పలుకే పసిడయ్యింది

చేతులు కడిగి అన్నం తినమన్న అమ్మమ్మ మాటే వేదమయింది
నాన్నమ్మ కాచిన కషాయమే కంఠానికి శ్వాస అయ్యింది

చెమటోడ్చి కష్టం చేయాలన్న గురువు పలుకే నిజమయ్యింది
ఆరుబయటే మరుగుదొడ్డన్న తాతయ్య మాటే ఆచరణీయమయింది

ఏసీ లకన్నా పచ్చని చెట్ల గాలే పరమౌషధా లయ్యాయి
గ్యాస్ కన్నా ఇంటి బయట కట్టెల పొయ్యే రుచికరమయింది

టీవీసినిమాల కన్నా ఆరుబయట అరుగు పై మాటలే ఆనందాన్నిస్తున్నాయి
ఫ్రిడ్జ్ లోని నీళ్ళ కన్నా కుండలోని నీళ్ళే సేదదీరుస్తున్నాయి

సెల్ ఫోన్ ల కన్నా పుస్తకాలే నేస్తాలయ్యాయి
స్టీల్ గిన్నెల స్థానే అప్పటి మట్టి పాత్ర లోచ్చాయి

ఇంగ్లీష్ మందుల కన్నా వంట గదే మందుల షాపయ్యింది
యాంత్రికత్వం స్థానే ప్రకృతే పరమౌషధం అన్న కనువిప్పు కలిగింది

అవునిప్పుడు భారతీయ సంస్కృతే విశ్వవేదం అయింది

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!