సరితూకం!

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

సరితూకం! 

రచన :: వాడపర్తి వెంకటరమణ

మాటకు మాటే సమాధానం
ఎడ్డెమంటే తెడ్డెమనే విధానం
నిత్యం కొంపలో జరిగే ప్రహసనం
ఎటు పోతుందో తెలియని జీవితం

సీరియళ్ళు చూడొద్దంటే ప్రమాదం
జలజలా రాలుతుంది జలపాతం
తక్షణమే పడకగదికి ప్రయాణం
తప్పదుగా నాకిక స్వయంపాకం

మూడుముళ్ళు వేసాననే హీరోయిజం
ఒక్క కొంగుముడితో చేసింది ఖతం
మాటలతో గుచ్చుతుంది కంటకం
ఆ విషయం గుండెల్లో గుంబనం

తను చెప్పినట్లు వింటే అనుదినం
చేస్తుంది రోజుకొక పర్వదినం
అడ్డుపుల్లవేస్తే అవుతుంది నాకు తద్దినం
ఎక్కడెక్కడో వెదకక్కర్లే పర్యాయపదం
పెంకికి నా భార్యే సరియైన తూకం!

You May Also Like

One thought on “సరితూకం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!