క్షణ క్షణం

అంశం: ఇష్టమైన కష్టం

క్షణ క్షణం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: ఎల్. నిర్మలరామ్

నీపై నాకు ఈ దిగులేలా
నీ జతగా చేరుటకై
నాకీ తపనేలా
పరిచయం ఏ విధంగా మొదలయినా.
ఏదో ఒక అద్వితీయ శక్తి సాయంతోనే
అత్యంత పవిత్ర భావమయిన ప్రేమ
రెండు మనసులను దగ్గర చేసి,
ఇరువురిని ఒక్కటిగా నిలుపుతుంది
అదే దైవ స్వరూప ప్రేమ మహత్యం.
కారణాలు ఏమైనా.
కానరాని తీరాలకు చేరి
అపరిచితులుగా మిగిలిపోయినా.
ఏవో జ్ఞాపకాల తడిని
తప్పక చవి చూపించే .
ఆహా ..ఆ బంధం ఎంత మధురం.
మెలిపెట్టే బాధనే మిగులుస్తున్నా.
పరిపూర్ణ ఔన్నత్య విలువలకు ప్రతి రూపంగా
మనల్ని చూపే ఆ సరి జోడును మరువడం
అసలు సాధ్యమా…?
ముక్కలైన మనసును పేర్చుకుని
ఓదార్చుకున్న నిశీధి
రోదనలు ఎన్నో.
ఓపలేని కన్నీటి సుడుల పయనించిన
సుదీర్ఘ రాత్రులెన్నో.
నే గడిపే ప్రతీ క్షణం
నీ ఆలోచనలు నాకేలా.
మలినం లేని ప్రకృతిని
తదేకంగా చూసే నా కన్నులకు ప్రతీది
నీ రూపమల్లె
తోచుట ఎందుకిలా.
చల్లని పవన తాకిడి
నీ స్పర్శల్లే అనిపించుట ఏల.
నాలో నాకే తెలియని
నీ పై ఇంత ప్రేమేలా.
నాతో ఎల్లప్పుడూ వుండే
నీడలో సైతం నీ ఛాయేలా.
ఏ పలుకుకి వనికి తొనకని
నా ఆధారాలపై అనూక్షణం
నీ పేరేలా.
క్షణ క్షణం నీ పై నాకు
ఈ దిగులేలా.
నీ జతగా చేరుటకై
నాకీ తపనేలా.
అయినా సరే.
ఎక్కడున్నా,
ఎన్ని రోజులు గడిచినా.
అనుక్షణం దూరమయిన
మనసుకు చేరువగా చేరి,
తన ఉన్నతిని
“శుభాన్ని కాంక్షించి” సంతోషించడంలోనే
అసలైన ప్రియురాలిగా ఉండడానికి
నేను ఇష్టపడతా…గర్వపడతా.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!