నా బిడ్డలే

అంశం:ఇష్టమైన కష్టం

నా బిడ్డలే
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: రాధ ఓడూరి

సునామీలకి తలవంచాను
ప్రకృతి విపత్తులను అధిగమించాను
మీ మానవజాతి
నను తూట్లు తూట్లుగా చీల్చినా
విషవాయువులను నాలో కలుపినా
ప్లాస్టిక్ వ్యర్థాలతో నను నింపినా
ఇష్టమైన కష్టంతో ఓర్చుకుంటున్నా
ఎందుకంటే…!
నను అంటి పెట్టుకునే నా వృక్షజాతి
నాకు వందనం చేసే అడవి మృగాలు
నను చల్లగా చూసే పర్వత శిఖరాలు
నా మేనును సుగంధం చేసే పూల వనాలు
నను వీడి పోనందుకే
మీ మానవజాతిని
నా బిడ్టలనే మనసుతో
ఇష్టమనే కష్టంతో భరిస్తున్నాను

You May Also Like

One thought on “నా బిడ్డలే

  1. రాధ గారు, చాలా బాగా వ్రాసారు. భావం బాగుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!