ఆత్మ పాపాల్ని భరించిన శరీరం

అంశం: ఇష్టమైన కష్టం

ఆత్మ పాపాల్ని భరించిన శరీరం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: కొల్లూరు నాగమణి

నీ పాపపుణ్యాలన్నీ నేను భరించుకొచ్చాను
ఆత్మవైన నువ్వంటే  శరీరమైన నాకిష్టమనీ
నీవు లేని నేను లేననీ, నేను లేని నీవు లేవనీ
నువ్వే నా బలమనీ, నువ్వే నా బలహీనతనీ

అమ్మకడుపులో నా చెత్తని నీ కోసం భరించేను
పుట్టేక కంపునోర్ల ముద్దులు నీ కోసం భరించేను
శరీరంకాలే వేడినీటి స్నానం నీ కోసం భరించేను
ఉగ్గుపేరుతో ఆముదం,పసర్లు నీ కోసం మింగేను

కొంచెం పెరిగేక మొట్టికాయలు, తన్నులు తిన్నాను
తోటివాళ్ళతో పోట్లాడి నా జుట్టు పీకించుకున్నాను
పనిబాట్లు విషయంలో అమ్మ చరుపులు తిన్నాను
స్కూలుకెళ్ళేరోజుల్లో టీచర్లబెత్తం దెబ్బలుతిన్నాను

కళ్ళ కలకలొచ్చి కళ్ళమంటల్తో దుఃఖపడ్డాను
గొంతులోని కాయల్ని కోస్తే చాలా బాధపడ్డాను
ఆటాలమ్మవస్తే శరీరమంతా పుళ్ళైతే ఏడ్చాను
కొన్నిసార్లు తీవ్ర కడుపునొప్పిని అనుభవించేను

పెళ్లయ్యాక వంటలో చేతులు కాల్చుకున్నాను
గోరుచుట్టుపైని తప్పని రోకటిపోట్లు తిన్నాను
పిల్లల్నికని కడుపు కోత, కుట్లు పాలయ్యాను
ఇన్ని కష్టాలు నీకోసం ఇష్టంగానే భావించేను

You May Also Like

3 thoughts on “ఆత్మ పాపాల్ని భరించిన శరీరం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!