నియంతలా సాగిపో

నియంతలా సాగిపో

రచన: వడ్డాది రవికాంత్ శర్మ

ధృడ నిశ్చయం ముందుకునెట్టింది …
సంకల్పం తరగని పెట్టుబడిగా మారింది..

అడ్డంకులు వస్తే రానీ….
ఆకర్షణల జోరు పెరిగితే పెరగనివ్వు …

బలంతో బలహీనతని ….
స్పష్టతతో సంక్లిష్టతని ….

దాటుకుపోయే నావే నీ మస్తిష్కము …
తరిగిపోని ఊహాశక్తే నీ సృజనాత్మకత …

వేచిచూస్తే అది చారిత్రక తప్పిదం ….
కాదు కాదు ఈరోజు ఎప్పటికీ ఆలస్య కారకం..

గతం తవ్వుకోవడం వృధా శ్రమ ..
భవిష్యత్తుపై ఆధిపత్యం నీదే సుమా…

సాహస ప్రయాణమైనా …..
అసాధ్యమైన గమ్యం ఐనా ….

పట్టుదలతో భరతం పట్టు …
శత్రువు నవ్వునే ఇంధనంగా …
మిత్రుని నమ్మకాన్ని చుక్కానిలా …

ఎక్కడిలెక్కని అక్కడ సరిదిద్దు ..
నిర్దేశించుకున్న గమ్యంవైపు ..
నియంతలా సాగిపో ….

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!