కరుణ రసం

అంశం: ఇష్టమైన కష్టం

కరుణ రసం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: వేల్పూరి లక్ష్మి నాగేశ్వరరావు

మానవ జన్మ మనుగడకు కరుణ ఒక ఇంధనం,
సాటి మనిషి నడిరోడ్డు మీద గుండెనొప్పితో పడిపోతే,
అభం శుభం తెలియని ఆడపిల్ల పరుగున వెళ్లి
నోటిలో నోరు పెట్టి, గాలి వాయువులు అందించి
ప్రాణం నిలబెట్టడం! ఒక కరుణరసం.
ఆస్పత్రిలో ముక్కు ముఖం తెలియని,
బాధితులకు, తన రక్తం అందించి, ప్రాణం నిలపడం ,
తనకు ఆ పని “కష్టమైనా ఎంతో ఇష్టంగా”
మనిషి ప్రాణాలు నిలబెట్టడం
మన అందరికీ ఆదర్శం.
మానవజాతి మనుగడకు నిలువుటద్దం
పుడమిని కరుణరసంతో నిలువెల్లా తడిపి
జగతిని ‘నిత్యకళ్యాణం పచ్చతోరణంగా
విర సిల్లెలా, ప్రతి మనిషి పాటుపడాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!