తరాలు-అంతరాలు

అంశం: బంధాల మధ్య ప్రేమ..2080.

తరాలు-అంతరాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన:దొడ్డపనేని శ్రీ విద్య

ఏమోయ్ కాఫీ తెస్తున్నావా అంటూ ఓ అరుపు అరుస్తాడు మంచం మీద ఉన్న భర్త విశాల్‌. అబ్బ ఉండండి, ఎన్ని పనులని చేయను నేను. వస్తున్న ఒక్క క్షణం ఊపిరాడనివ్వరు. ఎన్ని శతాబ్దాలు, 22 వ శకం వచ్చినా, గడిచినా… భర్తలు భార్యతో పొద్దున్నే ఇలా పిలవటం ఆగదేమో అనుకుంటూ చేతిలో కాఫీ కప్పుతో ఎదురు నిలుస్తుంది భార్య రూప. ఎందుకు అంత గావుకేక. తెస్తాను కదా కాఫీ, ఇంతకీ ఏంటి విషయం అంటూ మాట పొడిగిస్తుంది రూప. ఏమి లేదు రూపా, పిల్లలు లేచారా అని అడుగుతాడు విశాల్. అపుడే, ఇంకా 12 అయినా అవలేదు. అపుడేనా లేవటం, లేస్తారులే. ఏమయినా మాట్లాడాలా వాళ్ళతో అంటూ చేతిలో తాగిన కాఫీ కప్పు తీసుకుని వంట గదిలోకి వెళుతుంది రూప.ఏంటో ఈ కాలం పిల్లలు. మా చిన్నప్పుడు మేము కనీసం 9 కల్లా లేచే వాళ్లం. ఇప్పుడు వీళ్ళు 11 అయినా లేవటం లేదు అని గొణుక్కుంటూ బాత్ రూమ్ లోకి నడుస్తాడు విశాల్, 12 దాటుతుంది. అమ్మాయి మిషిత మెల్లగా కళ్ళు నులుముకుంటూ అమ్మ కాఫీ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది. అన్న లేచాడా మిషి అని విశాల్‌ అడుగుతాడు. ఏమో డాడ్ తెలీదు. రూమ్ లో ఉన్నడో లేడో అంటూ కాఫీ కప్ అందుకుని సెల్ చూస్తూ ఉండి పోతుంది. ఏమ్మా ఈ ఏడాదన్న పెళ్ళి చేసుకుంటావా అని డైరెక్టుగా మనసు లోని మాటను కూతురు ముందు బయటపెడతాడు. పెళ్ళా అవసరమా డాడ్. నేను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఏ బంధం తో అవసరం కూడా లేదు. ఆల్‌ రడీ  నేను ఒకరితో డేటింగ్ లో ఉన్నాను. అతనికి ఇష్టమున్నా…. నాకు ఇష్టం లేదు పెళ్ళి. అంటూ చావు కబురు చల్లగా చెబుతుంది మిషిత .
ఆ …. అంటూ నోరు తెరవటం విశాల్‌ , రూప వంతు అయింది. ఇదే (కూతురు) ఇలా ఉంటే ఇంక కొడుకు ఎలా ఉంటాడో, ఎం అంటాడో ఊహించనవరం లేదు కదా అనుకుంటూ పేపర్ ముందేసుకుంటాడు విశాల్ తల పట్టుకుని. వాళ్ళ గురించి తెలిసి కూడా అడిగి ఎందుకు తల పట్టుకోవటం అంటూ అని. నేను బయటకు వెళుతున్న పని ఉంది.. అంటూ కదులుతుంది రూప. పోనీలే నువ్వయినా నాకు ఈ మాత్రం చెపుతున్నావు అని గోణుక్కుంటాడు విశాల్‌. భగవంతుడా ఎన్ని సంవత్సరాలు గడిచినా నాలాంటి వాళ్ళ మనసులు మారువు. కానీ ఇప్పుడు ఉన్నాయా బంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, మా కాలంలో కనీసం చెప్పక పోయినా పెళ్ళి చేసుకునే వారు వాళ్లకు వాళ్ళు, ఇప్పుడు స్వేచ్ఛ అంటూ అసలు పెళ్ళే వద్దనుకుంటున్నారు పిల్లలు. ఎన్ని తరాలు మారినా అంతరాలు పెరుగు తున్నాయి. మనుషుల మధ్య దూరాలు పెరుగుతున్నాయి. ఫాషన్, టెక్నాలజీ నెపంతో  సాంప్రదాయాలు దూరమయ్యాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా అమ్మ తనపు మాధుర్యం తగ్గదు కదా. అది అర్థం కాదు ఈ కాలం పిల్లలకు.. పెద్దలకే పట్టటం లేదు ఇంక పిల్లలని అని ఎం ప్రయోజనం?  అని తనలో తను మధన పడతాడు విశాల్‌.

You May Also Like

4 thoughts on “తరాలు-అంతరాలు

 1. ధన్యవాదములు తపస్వి
  🙏🕉️🙏

 2. నిజమే తరాలు మారే కొద్దీ
  అలానే ఉంటుంది
  🤦‍♂️

 3. ధన్యవాదములు తపస్వి మనో హరం
  🙏🙏🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!