ఆమె పుట్టింది

ఆమె పుట్టింది

(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పరిమళ కళ్యాణ్

ఆమె పుట్టింది
ఆ’డపిల్ల అన్నారు
ఆమె నవ్వింది

ఆటల్లో పాటల్లో
చదువులో ముందున్నా
ఆడపిల్లే అన్నారు
పై చదువులు చదువుతా అన్నది
ఆడపిల్లకి ఎందుకు అన్నారు?

ఉద్యోగం చేయాలన్నది
ఆడపిల్లకు అనవసరం అన్నారు!
బయటకి వెళ్ళాలి అంటే
తోడు అవసరం అన్నారు!
పెళ్ళీడు వచ్చిందన్నారు
పెళ్ళి చేసి అత్తారింటికి పంపేశారు!

అక్కడా అదే బాధ
ఆ’డపిల్ల కదా అన్నారు
వాళ్లలో మనలేక పోయింది
ఆ’డపిల్ల ఇది అన్నారు!

నెమ్మదిగా మారుతూ వచ్చింది
కాలం గడిచింది
పాపాయి పుట్టింది
ఆడపిల్లా? అన్నారు

ఆడపిల్ల వద్దన్నారు
పురిటి పసి కందునే
వదిలెయ్య మన్నారు
ససేమిరా అంది
తనకి కావలన్నది
ఒప్పుకోలేదు అందరూ!

ఎవ్వరూ తనకి వద్దంది
తన పాపే ముఖ్యం అనుకున్నది
బంధాలను విడిచింది
పేగు బంధం కోసం
పాపే ప్రాణంగా మారింది
తానే ఊపిరి పోసింది!

బిడ్డని తనలా కాకుండా
తన కాళ్ళ మీద తాను నిలబడేలా
పెంచాలి అనుకుంది
తన లక్ష్యం వైపు అడుగులు వేసింది!
పాత తనని వదిలేసి
కొత్త తను గా రూపు దిద్దుకునే దిశగా!
పయనం కొనసాగించింది!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!