నీ చూపుల వలలో..

నీ చూపుల వలలో..

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: వాడపర్తి వెంకటరమణ

నీ ఓరచూపులు
చల్లని సాగర సమీరంలా
నా మనోఫలకంపై వాలిపోయి
మౌనభాషలో కథలెన్నో చెప్పాయి

నీ కొంటెచూపులు
విచ్చుకున్న విరి బాణాలై
నా ఎదలోతుల్లో చేరిపోయి
జీవనగతికి దారులు వేశాయి

మత్తకోయిలలాంటి నీ మత్తైన చూపులు
హత్తుకోమని ఆహ్వానిస్తుంటే
అలనల్లగాచేరే నీ అల్లరి చూపులు
కౌగిలి కాసారంలో బంధించమంటున్నాయి

నీ చూపుల వలలో చిక్కుకున్న
నా హృదయమిప్పుడు
ప్రేమవనంలో ప్రియురాలితో
వసంతగీతాలు ఆలపించాలని ఆరాటపడుతోంది!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!