ఒకే ఒక్కడు

(అంశం: “ఏడ తానున్నాడో”)

ఒకే ఒక్కడు

రచన: లక్ష్మి శైలజ ఇందుర్తి

ఒకే ఒక్కడు,
తల్లిదండ్రులే దైవమని భావించి
వారిని పూజించి
వృద్ధాశ్రమానికి అంకితం చెయ్యక
కంటికి రెప్పలా కాపాడాలని
రైతన్న కష్టం తెలుసుకుని అతనికి
చేయూత ఇవ్వాలని
అన్యాయపు అవశేషాలను
తొలగించాలని
ఆడపిల్ల కి రక్షణ లేకపోతే
రేపటితరానికి అమ్మ ఉండదు అని
నమ్మి,

ఆడపిల్లలపై జరుగుతున్న ఘోర
అకృత్యాలను అడ్డుకుని
వారికి రక్షణ కల్పించాలని
పెరిగిపోతున్న అవీనీతిని, అసమర్థతను ఆపివేయడానికి,
ఇలా సమాజాన్ని సరైన మార్గంలో
నడవాలి అంటే నడిపే నాయకుడు
ఆ ఒకేఒక్కడు ఎక్కడ
ఏడతానున్నాడో అని వెతికే
ముందు నిన్ను ‌నీవు ప్రశ్నించుకో

అది నీవు కాదా
నీలో ఆ శక్తి లేదా
ఎందుకు ఎవరో వచ్చి ఏదో చెయ్యాలి అని ఎదురు చూపు
ఎవరికోసం కాక
ఎవరికై ఎదురు చూడక
సమాజాన్ని మంచి మార్గం
వైపు నడిపించడానికి ధైర్యాన్ని నింపుకుని నీ అడుగు తో పయనం ప్రారంభించి,
విజయపు తీరం చేరుకో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!