మంచితనానికి పురస్కారం

మంచితనానికి పురస్కారం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: మహేంద్ర కుమార్

అతుకుల నవ్వులు చూపిన గతుకుల చిత్రం
మూగబోయిన మనసు మిగిలె అచేతనం
శృతి తప్పి రోదిస్తున్న కన్నీటి శోకగీతం
లయ తప్పి ఆడుతున్న ఆవేదన నాట్యం
నయవంచనను పరిచయం చేసిన నమ్మకం
నయనానికి కనిపించని తెర వెనుక నాటకం
అమాయకపు రంగు పూసుకున్న కాఠిన్యం
అవసరానికి అనుగుణంగా చేస్తున్న అభినయం
పిమ్మట కనిపించే అసలు విశ్వరూపం
మనిషి రూపంలో దాగిన రాక్షసతత్వం
మంచితనానికి దొరికిన పురస్కారం
నరరూపన ఉన్న భస్మాసురుల హస్తం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!