పిసినారి అత్త

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
పిసినారి అత్త  
రచన:: సంజన కృతజ్ఞ
సూర్యకాంతం అనే ఆమెకు ఇద్దరు కొడుకులు. భర్త పోవడంతో అల్లారుముద్దుగా పెంచుతోంది. వయసు కు అనుకూలంగా పెళ్లిళ్లు చేస్తుంది. చాలా పిసినారితనం ఆమెది. పెద్ద కోడలు వాణి దుబారా మనిషి ,అత్తకి కోడలికి ఏమాత్రం పడేది కాదు. సూర్యకాంతమ్మ పావుకిలో టమాటాలను పచ్చడి, చారు కూర చేసి మూడు రోజులు వెల్లబుచ్చేది. వాణికి మాత్రం అత్తచేసే పిసినారి పనులు కోపాన్ని తెప్పించేవి .ఒక పూట ఓర్చుకున్న మరొకపూట వారిద్దరి మధ్య గొడవ తప్పేది కాదు .చిన్న కోడలు గడుసరి బహు హుషారైనది. కనబడకుండానే సురుకు పెట్టేది. ఒకరోజు సూర్యకాంతమ్మ పళ్లెంలో అన్నం పెట్టుకొని చారేసుకొని తింటుంటే చిన్న కోడలు వచ్చి అమ్మమ్మో అబ్బో అబ్బో అంటూ లబాదిబా గుండెలు బాదుకుంటూ ఓ అత్తో అంటూ ఏం చేస్తున్నారు మీరు ఇలా తింటే మనం ఊడ్చిపెట్టుపోతాం .ఇలా కాదు కానీ మీరు ఇలా రండి చెప్తా అంటూ, ఆ ఇంట్లో ఉన్న ఒక్కొక్క కిటికీ దగ్గర తీసుకువెళ్లి పక్కింటి వారి వాసనలను ఆస్వాదిస్తూ తెల్ల అన్నం పళ్లెంలో పెట్టుకొని ఒక ముద్ద ఒక కిటికీ దగ్గర అంటూ నాలుగిండ్ల వాసనలతో అన్నం తినేయాలి .అని హితబోధ చేస్తుంది .ఇక అంతే నోరు వెళ్ళబెట్టికొని ఆశ్చర్యంతో
“ఓసి నీ ఇల్లు బంగారం గాను” నన్ను మించి పోయావే !అత్తకు తగ్గ కోడలు అనాలో ,అన్నం పెట్టక చంపే కోడలనాలో అర్థం కాక లోపల లోపల గుణుక్కుంటుంది .ఇదంతా గమనిస్తున్న పెద్దకోడలు మాత్రం లోలోపల తీన్మార్ డాన్స్ వేస్తుంది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!