కాకుల గోల 

( అంశం::”ఓసి నీ ఇల్లు బంగారం గానూ”)
కాకుల గోల   
రచన:: యాంబాకం

ఆరోజుల్లో చంద్రగిరి రాజు సాహిత్య ప్రియుడు. కవి పండితులను ఘనంగా పోషించేవాడు.తనకు నచ్చేలాగ కవిత్వం చేబితే బహు సత్కరించి పంపేవాడు. అందుచేత అతని రాజ్యం లో దాదాపు అందరూ కవులే చిన్న పిల్లలు సైతం పండితులే!
అనాదిగా విజయనగరం పండితులకు దేశ మంతటా గొప్పఖ్యాతి ఉండేది. కానిచంద్రగిరి పరిపాలనలో పండితులఖ్యాతి పైకి వచ్చింది.రానురాను దేశంలో విజయనగర పండితులను తలుచుకునే వారే లేకుండా పోయారు.
ఇది గమనించిన విజయనగర పండితులకు కోపంవచ్చి, ఓసి నీ ఇల్లు బంగారం గాను చంద్రగిరి వారికి ఇంత తెలివి ఎలాగు అని తలంచి వారంతా కలసి ఒక సభ చేశారు.విజయనగరపండితులు కొందరు చంద్ర గిరి కి వెళ్ళి అక్కడ పండితులను బహిరంగ చర్చలో ఓడిస్తేగాని విజయనగర ప్రతిష్ఠ నిలవదని సభలో తీర్మానించారు. ఇందుకు గాను నలుగురు దిగ్గజాలవంటి పండితులను ఎన్నుకొని వారిని చంద్రగిరికి ప్రయాణం కట్టించారు.
ఈ నలుగురు పండితులు చంద్రగిరి చేరుకొని ఒకసామాన్య గృహస్థుడు ఇంటబస చేశారు.
ఆ గృహస్థుడు వారిని గౌరవంతో ఆదరించి వారికి తన శక్తి కొద్దీ సమస్త సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. గృహస్థునికి10సం//ల కొడుకు ఉన్నాడు. చంద్రగిరి లోఅందరికి పండితులపట్ల గౌరవం ఉన్నట్టే కనబడినది. వారినిఎలా ఓడించాలో తీరావారిచేతులో ఓడిపోతే తమకే గాక విజయనగరానికే అపఖ్యాతి వస్తుందనివారు భయపడుతూనే ఉన్నారు.
పండితులు మరుసటి ఉదయం వేకువ జామునే లేచి నిత్యకృత్యాలు తీర్చు కుంటున్న సమయంలో ఒక చిత్రం జరిగింది.చెట్లమీద కాకులు కోలాహలంగాఅరుస్తున్నాయి.
ఈ అరుపులు విన్న ఇంటివారి కుర్రవాడు తన అమ్మ తో అరుణోదయం వేళ కాకు లెందుకు అరుస్తాయి అని అడిగాడు, నీళ్లు తేవడానికి బిందె చంకన పెట్టుకొని బావి వద్దకు పోతూ ఓసి నీ ఇల్లు బంగారం గాను నీ ప్రశ్నలు మొదలెట్టావా!అని గొనుగు తూ “మన ఇంటిలో నలుగురు విజయనగర పండితులున్నారు అంత చిన్న అనుమానం వారు తీర్చగలరు, వారినినడుగు అని వెళ్ళి పోయింది. ఆ కుర్రవాడు పండితుల దగ్గిరికి వచ్చి “అయ్యలార ఈ సందేహం తీర్చండి. అని తెల్లవార బోతుండగా కాకులు లెందుకు అరుస్తాయి? సవినయంగా అడిగాడు.
విజయనగరం పండితులు ఒకరి ముఖాలు నొకరు చూసుకొన్నారు. ఓసి నీ ఇల్లు బంగారం గాను అని గొనిగారు, నిజానికి కాకులు పొద్దున్నే ఎందుకు అరుస్తాయో వారికి తెలియదు .వారికలాంటిసందేహం ఎప్పుడూ కలగ లేదు.
ఆ సందేహానికి సమాధానం చెప్పాలి గనుక తమకు తోచినది చెప్పారు .”పొద్దున్నే లేచి కాకులు ఒకదాన్ని ఒకటి పలకరించు కుంటాయి.అన్నాడొకడు.రోజల్లా పలకరించుకోంటునే ఉంటాయి.,అన్నాడు మరోకరు, ఉదయాన అన్ని ఒక్కసారిగా ఎందుకు అరుస్తాయి? అని అడిగాడు కుర్రగాడు.
“రాత్రి అయిపోయి పగలు వచ్చిందని సంతోషంగా అరుస్తాయి”అన్నాడింకొక పండితుడు”.అరుణోదయంలోనేఎందుకు? అన్నాడు కుర్రవాడు. మిగిలిన పండితులు కూడా ఎదో చెప్పగా,కాని కుర్రవాడికి తృప్తికలగలేదు.
ఇంతలో కుర్రవాడి అమ్మ నీళ్ళబిందెతో తిరిగివచ్చింది. అమ్మ నీవైన చెప్పవా? తెల,తెల్లవారేటప్పుడు కాకులన్ని ఎందుకలా గోలగాఅరుస్తాయి? అడిగాడు. నేను పండితులను అడగమని చెప్పాను గదా! అడగలేదా అంది, అమ్మ వారికి సరిగా తెలిసినట్లే లేదమ్మ అన్నాడు‌ కోడుకు .
“అయితే నేను చెబుతాను విను సూర్య భగవానుడు చీకటి నిర్మూలిస్తూ ‌రావటం చూసి నల్లగా వున్న తమను కూడా చీకటి గా బావించి నిర్మూలించి పోతాడేమోనని కాకులు ” మేము చీకటి కాము, కాకులము ,అని కావు!‌, కావు! అని సూర్య భగవాణ్ణీ ప్రార్థన చేస్తూ హెచ్చరిస్తున్నాయి.” అంటూ!అమ్మ లోనికి వెళ్ళి పోయింది.
తన సందేహం తీరినందుకు కుర్రవాడు ఆనందంతో గంతులువేయసాగాడు.ఇదంతా వింటూచూస్తున్న విజయనగరం పండితులు ఓకరి మొ‌ఖంలోకరు చూసుకొని ఓసి నీ ఇల్లు బంగారం గాను
“అయినా సామాన్య గృహస్థు ని భార్యకే ఇంత ప్రజ్ఞ ఉంటే ఇక ఈ దేశపు పండితుల ముందు మన మెంత? అని తలచి వారిలోవారే అప్పుడే విజయనగరం ప్రయాణం కట్టి వెళ్లి పోయారు. పండితులు. ఓసి నీ ఇల్లు బంగారం గాను అని గొనుగుతూ.

సమాప్తం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!