ఇది కథే!

ఇది కథే!

రచన:: దోసపాటి వెంకటరామచంద్రరావు

“హలో!నేను రాజుని !వస్తున్నావా!నీకోసమే నిరీక్షణ”.
“ఒక్క పదినిమిషాలు ఒపికపట్టు నీముందంటానుబాబు”రాధిక
“పది నిమిషాలైపోయాయమ్మా!ఇంకా నీదర్శనం కాలదేమిటి”రాజు
“అబ్బా!ఉండవయ్యా కా బోయే మగడా!ముందు వరండాలో నాన్న కాపలా”రాధిక
ఒకటి రెండు మూడు ……ఆరగంటైంది .రాధిక రాలేదు.ఇక రాదు.ఇక ఈ రోజుకింతే. రాజు వెళ్ళిపోయాడు.

***

“హలో !రాజుబాబు నేను రాధికను.కోపమా నాపైనా…
ఇక చాలు …చాలు.నీకోసమే ఎదురుచూపులు ఓ పదినిమిషాలనుండి.వస్తావుగా…వస్తావులే…రాకుండా
ఎలా వుంటావు””
రాజునుండి నిశ్శబ్ధం.
మళ్ళీ రాధిక ఫోను చేసింది.
జవాబులేదు.అరగంట చూసింది.ఇకరాడని తెలిసి వెనుతిరిగింది.

***

“హలో!నేను రామనాధాన్ని.రాధికతండ్రిని.నీతో మాట్లాడాలి.బీచ్ దగ్గర మీరిద్దరూ కలుసుకోనేచోటే.రావాలి మరి”
రాజుకి ఆశ్చర్యం.ఇంత త్వరగా ముసలాడు స్పందిస్తాడనుకోలేదు.అరగంట గడిచింది.ముప్పావుగంట గడిచింది.రాజు వెళ్ళలేదు.
“హయ్ డియర్!నేనే నీ డార్లింగుని.ఇక్కడ పదినిమిషాలై నీకై ఎదురుచూపులబ్బాయ్.రావేమి.
ఎందుకమ్మా అంతకోపం.వచ్చేయ్ వేగంగా.నీకో సర్ప్రైజు వార్త చెప్పలమ్మా”.రాధికకి తెలీదు ఆ సర్ప్రజు వార్త రాజుకెప్పుడో తెలిసిందని.
రాజు వెళ్ళలేదు.ఫోను మాట్లాడలేదు.పాపం రాధికకితెలీదు.రాజు రాడని.ఫోనెత్తడని.

***

రాజు ఆఫిసునుండి వచ్చేసరికి గదిలో శుభలేక పడివుంది .అది రాధిక పెళ్ళిశుభలేక.రాజు భగ్నప్రేమికుడు కాదు.ఒకచిన్న ఈల అతని నోటినుంచి వచ్చింది.నమ్మండి ఇది కధే!

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!