జీవిత సత్యం మధురమే

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

జీవిత సత్యం మధురమే

రచన:నారుమంచి వాణి ప్రభాకరి

సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు చంద్రుడు చల్లని వెన్నెలనిస్తాడుప్రకృతి నిస్వార్థ సేవ చేస్తుంది ప్రకృతి ఆరాధకుడు మంచి కవి కళా కారుడు అవుతాడు కళా కారుడు నిరంతర సాధన చేస్తే గాని కీర్తి ప్రతిష్టలు రావు కదా మంచి వ్యక్తులు ఎప్పుడు జీవిత సత్యాలు చెపుతారు అందుకే పేరున్న ఘనమైన వ్యక్తులు సత్య శోధన నీతి మార్గం ద్వారా ఉన్నత శిఖరాలు అధిరోహంచాలని
ఆశ పడతారు ఏ ప్రముఖ వ్యక్తి జీవితం పరిశీలించినా మనకు సత్య సాధన శోధన కనిపిస్తాయి

అందాల హరి విల్లు లాంటి ఇల్లు అందులో ఇద్దరు ఆడ పిల్లలు ఒక మగ పిల్లాడు మాధవ్ అక్కల ప్రేమతో పెరిగాడు బాగా మాట కారీ చిన్న తనం లోనే కవిత్వం లాగా కబుర్లు చెప్పి పెద్దల నుంచి పిల్లల వరకు మంత్ర ముగ్ధుల్ని చేసే వాడు అతను చెప్పిన పని ఎవరు కాదు అని అనరు పెద్ద వాళ్ళకి చెపితే అవునురా మనవడా నిజం.చెప్పావు అంటారుపిల్లలకి చెపితే అవును అంకుల్ నువ్వు చెప్పింది నిజమే అంటారు బుద్ధిగా అందరూ వింటారు అదే అతను మాటల మాంత్రికుడు. వీడిని ఎవరూ పెళ్లి అడుతుందో అదృష్ట వంతురాలు అన్నారు అంతా
అప్పుడే పెళ్లా నాపైన ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళకి అయ్యాక నా పెళ్లి ఎక్కడ పుట్టిందో మరి ఆ భాగ్య వంతురాల అనడం తప్పదు

మాధవ్ సిగ్గు పడిపోయాడు వీడి మాటలకి కోటీశ్వరుల పిల్ల వస్తుంది తధాస్తు అని ఓ బామ్మ అన్నది అందరూ నవ్వు కొన్నారు మాధవ్ ఎక్క డా ఉంటే అక్కడ నవ్వులు విల్లీ విరిస్తాయిఏ బంధువులు స్నేహితులు పిలిచినా తప్పక వెడతాడు కారణం లేక పోలేదు ఇద్దరు అక్కలు పీజీ చేసి ప్రైవేట్ కాలేజిలో ఉద్యోగం చేస్తున్నారు తండ్రి బ్యాంక్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యాడు తల్లి గృహిణిగా కుటుంబ వ్యవస్థలో ఇమిడి పోయింది అప్పుడప్పుడు కధలు కవితలు పత్రికలకు రాస్తుంది

ఎన్నో ఆదర్శ భావాలు ఆత్మీయ తత్వాలు ఉన్న మనిషి ముగ్గురు పిల్లల్ని పద్ధతిగా జాగ్రత్త గా పెంచిధి ఇద్దరు ఆడపిల్లలు కూడా బాగా చదువు కొన్నారు ఉద్యోగాలు చేస్తున్నారు పెళ్లి అయ్యాక భర్త అత్త వారి ఇష్టము ఇంట్లో ఖాళీగా ఉంటే ఎలా అని ఉద్యోగాల్లో చేరారు నిజానికి.పెద్ద వాళ్ళకి ఇష్టం లేదు కానీ వాళ్ళు చదువుకున్న కాలేజి కనుక జాయిన్ అయ్యారు అంతా తెలుసున్న లెక్చరర్ లు కూడా అందుకే పట్టు పట్టి చేరారు జీతాలు తక్కువే కానీ ఇచ్చిన డబ్బు నిల్వ చేసేవారు mమీ డబ్బు మాకు వద్దు మీరు బంగారం కొనుక్కోండి అని తల్లి తండ్రి చెప్పేవారు అయితే పిల్ల లు కి ఒకసారి ఇద్దరికీ సంభందాలు కుదిరితే చేసే లాగ అన్ని ఏర్పాట్లు చేశారు చీరలు నగలు సారే సామాను అన్ని కూడా రెడీ చేశారు .

మాధవ్ పెళ్లి సంభాషణల వచ్చి నప్పుడల్లా నవ్వుతూ ఉంటాడు ఎందుకంటే ముందే నీకు ఫలానా వాళ్ళు రాసి ఉన్నారు వెళ్లి చేసుకో అని చెప్పే యంత్రం వస్తె బాగుండును అంటాడు అవును నిజమే అని అక్కలు వత్తాసు పల్కుతారు. మళ్లీ నవ్వులు విల్లీ విరుస్తాయి

***

మొత్తానికి మాధవ్ అక్కలకి సంభందాలు తెచ్చాడు వారు అక్క చెల్లెళ్ల పిల్లలు పెద్ద పెళ్ళిలో చిన్నక్క ను చూసి కావాలని పెళ్లి చేసుకున్నారు పెద్ద కట్నాలు అడుగ లేదు చదువుకున్న పిల్లలు అవుసరం అనుకుంటే మేము చేయిస్తాము మాకు అవసరం లేదు ఇద్దరు కూడా ప్రభుత్వ కాలే జి ఉద్యో గస్తులు ఇంకా ఏ భాధర బందీ లేదు మాధవ్ కి లైన్ క్లియర్ అయ్యింది ప్రేమ నిజంగా మధురమైన అనుభూతి అందరికీ ఈ ప్రేమ విలువ తెలియదు మానసిక స్థితి అతి గొప్పది ఒక అమ్మాయి గురించి ఎంతో ఆలోచించి వివరాలు తెలుసుకుని ప్రేమించే వారు కొందరు
డబ్బు చూసి ప్రేమించే వారు కొందరు ఉద్యోావకాశాలు బట్టి ప్రేమించేవారు కొందరు పని పాట చేసి దాన్ని కొందరు మంచి కళా కారిణి కావాలని మరి కొందరు ఇలా ఎన్నో ఆలోచించి ప్రేముచే వారు కొందరు మాకు నచ్చింది చెంచా వద్దు పిల్లని చెయ్యండి అని అడిగి.ఎంతో ప్రేమగా చేసుకునేవారు మరి కొందరు ఎది ఏమైనా ప్రేమను మాటల్లో కాక చేతల్లో చూపేవారు ఘనులు పెళ్లి తరువాత ప్రేమ ముఖ్యము పెళ్లి కి ముందు నిన్ను తప్ప ఎవర్ని పెళ్లి అడను అని పట్టు పట్టి చేసుకుని పెళ్లి తరువాత పెళ్ళాన్ని పట్టించుకోని ప్రముఖులు ఉన్నారు అలా కాక పెళ్లి తరువాత చక్కగా ప్రేమతో చూసే భర్త కోసం స్త్రీలు ఎదురు చూస్తారు

మాధవ్ ఒక్ పెళ్ళిలో స్నేహ ను చూసాడు తల్లి తండ్రి కి కూడా చెప్పాడు అయితే వాళ్ళు మాత్రం పిల్ల ఒక్కతి మాకు ఎంతో గారంగా పెంచా ము అందుకని దానికి ఒక మాట చెప్పి చేస్తాము అన్నారు. అలా రెండు ఏళ్ళు గడిచాయి వాళ్ళకి పిల్లని వదలి ఉండటం కుదరదు మాకు ఇంట్లో ఉండే అబ్బాయి కావాలి అని తేల్చి చెప్పాడు వార్కి అవగాహన లేదు అని మాధవ్ పట్టు వదలని విక్రా మార్కుడి ల స్వప్న చుట్టు తన ప్రేమ పందిరి నీ అల్లాడు ఎంత్నో బాగా మంచి మంచి జీవిత సత్యాలు చెప్పాడు స్వప్న మనస్సు గెలుచుకున్నాడు అవసరం అయితే స్వప్న కోసం నేను మీ ఇంటి కి వచ్చేస్తాను అక్కడ అయితే ఏమిటి ఇక్క డ ఉంటే ఏమిటి? నాకు స్వప్న నచ్చింది. మంచి కళా కారిణి ఆమెకు ఉన్నత జీవితం ఇస్తాను అని చెప్పి పెళ్లి చేసుకున్నాడు పిడి కిట తలంబ్రాలు పెళ్లి కూతురు అన్న శ్రీ అన్నమయ్య శ్రీ వేంకటేశ్వర స్వామి కీర్తన సెల్ ఫోన్ రింగ్ టోన్ లో శుభ సూచ కంగా మోగింది

పెళ్లి ఘనంగా చేశారు ఒక్క పిల్ల గారంగా పెంచారు అల్లుడు ఎరీ కోరి వచ్చాడు అన్న మాట ప్రకారం జీవితంలో సత్య మాధుర్యంతో స్వప్నను ఆనంద డో లలో ముంచాడు
కళా కారిణి గా ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న మాధవ్ జీవితం మూడు పువ్వులు అరు కాయలుగా మారింది ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కదా అటూ అమ్మానాన్న నీ ఇటు అత్త మామని సంతోష పెట్టడానికి అతను కృషి చేశాడు అల్లుడు కొడుకు లా ఉన్నందుకు అటూ ఇటూ వారు ఎంతో ఆనందించారు.

మాధవ్ కాల గమన మూలో మంచి రచయిత గాను ఒక ఛానెల్ కి సీఈఓ గా ను ఎదిగాడు మంచి రచయితగా కూడా సాహిత్య అకాడమీ అవార్డు పొందాడు అందరికీ అందంగా ఉంది అంతే కాకుండా నిజమైన విలువలు చెప్పే కదలు ఎక్కువ రాసి ప్రేమ్ ఎంతో మధురం అని తన జీవితం ద్వారా కథల ద్వారా యువతకు చక్కని సందేశం ఇచ్చే రచనలు ఎంతో పేరు తెచ్చాయి

శుభమ్

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!