తాతయ్య ప్రేమ

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

తాతయ్య ప్రేమ

రచన:యాంబాకం

వెంకటాపురం అనే ఊరిలో రంగయ్య అనే అతను కాపురం ఉండేవాడు. రంగయ్య పెద్ధ మనిషి. అందరికీ నోట్లో నాలుక లా ఉండేవారు. అతనికి ఒక కొడుకు పేరు వెంకట్ రావు. రంగయ్యకు ఒకే ఒక కోరిక కొడుకు వెంకట్ రావు కు ఒక పిల్లవాడు పుడితే మనవడుతో సరదాగా గడిపి ఆతర్వాత చనిపోవాలని అతని చివరి కోరిక.రంగయ్య మనవడు పుట్టాలని కొడుకు, కోడలి దగ్గర చాల పూజలు, వ్రతాలు చేయించారు. రంగయ్య కోరిక ఫలించి అతను అనుకొన్నట్టు గానే మనవడు పుట్టాడు.వాడికి ఘనంగా నామకరణం మహోత్సవం జరిపించి శివరావు అని పేరు పెట్టి,చాల ముద్దు గా పెంచసాగాడు.
తరువాత రంగయ్య మనవడిని ఒక్క క్షణం కూడా విడిచేవాడు కాదు. కొడుకు,కోడలు మనవడి ని ఏమన్న అంటే ఊరుకునే వాడు కాదు రంగయ్య. అలా అలా మురిపంగా పెంచాడు మనవడు శివరావుని. పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు శివరావు. ఒక రోజు రంగయ్య పొరుగూరు కి పని గావెళ్ళాడు .అప్పుడు ఏదో విషయం మీద అమ్మ అరిచిందని శివరావు తాతయ్యకు కూడ తెలియకుండా చెప్పుకొందామంటే, ఎవరు లేరు అని తలచుకొంటూ ఎవరి
కి చెప్పకుండ శివరావు అలిగి ఎటో వెళ్ళి పోయాడు .అప్పటి కి శివరావు వయస్సు పద్నాలుగు సంవతసరాలు. అంతవరకూ పెంచుకున్న బాల్య స్నేహాన్ని ఆపరిసరాల మీద పెంచుకొన్న బంధాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న తాతయ్య ప్రేమను, ఇంటిని తెంచుకొని దిగులుగా బెరుకు బెరుగ్గా నడుస్తూ చీకటి లోకి జారుకొన్నాడు శివరావు అలిగి!ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ వెతికారు ముఖ్యంగా తాతయ్య, కాని కనిపించ లేదు. అందరూ వాడికి రెండురోజులు మాడితే వెత్తుక్కొంటు వాడే వస్తాడులే!
అనుకొని అందరూ ప్రశాంతంగా ఉన్నారు. కానీ శివరావు తాతయ్య మాత్రం మనవడు లేడు అన్నమాట గురించి దిగులు చెంది నామీద కూడా అలగటమా! నాకు చెప్పకుండా ఇల్లు వదిలి పోయాడు అని తనలోతానే మదనపడుతూ చాల కాలము వరకు ఎదురు చూసాడు.
చూస్తూఉండగానే పదిహేను సంవత్సరాలు గడిచిపోయిన మనవడి జాడలేదు .అందరూ ఇంకేమి పిల్లవాడు చనిపోయి ఉంటారని గుండె నిర్బరంతో శివరావుని మరచి పోయారు. కానీ తాతయ్య దిగులు తో మనవడి మీద ప్రేమ తో మంచమెక్కాడు. ఒక రోజు
ఒక కొత్త యువకుడు మొదటి బస్సు దిగాడు ,వెంకటాపురం లో అప్పుడే అటువైపు వస్తున్న ఒక వ్యక్తి ఎవరు ఇంటి కి నాయన అని పలకరించాడు. నేను రంగయ్య మనవడను అరే!మా శివరావు వా?నాయన నీమీద బెంగతో గోరం జరిగిపోయింది .తొందరగా ఇంటికిపో నాయన అని ఎదో చెప్పలేక అటు వెళ్ళి పోయాడు. ఆవ్యక్తి. శివరావు ఇంటికి సమీపంలో ఉండగానే అందరూ గుసగుసలు రంగయ్య మనవడు మీద బెంగతోనే పోయాడు లేకపోతే ఇంకా కొంత కాలం బ్రతికే వాడు అనుకొంటూ అటు వెలుతున్నారు. శివరావు కి ఏముంది ఒక్క సారిగా పెద్ద షాక్ ఓ వ్యక్తి మృత శరీరం నా ముందు అన్ని బంధాలకూ దూరంగా అతీతంగా, ప్రశాంతంగా పడుకొనివుంది.అది తాతయ్య దేహం.అని తాతయ్య చివరి ప్రయాణం అని ఊహించని వాడై శివరావు నమ్మలేక పోతున్నాడు.గుండె కొట్టు కొంటూనే వుంది శివరావు మెదడు ఆలోచనలో గతం తాతయ్య జ్ఞాపకాలు నేమరవెసుకొంటూ అక్కడే ఒక మూల కూర్చుని,తాతయ్య దేహం వైపు చూస్తూ…నిక్కర చొక్కా వేసుకొని కొత్త స్కూల్ లో అడుగు పెట్టిన రోజులు అవి నాచేయి పట్టుకొని తాతయ్య నన్ను బడిలో వదలి తిరిగి సాయంత్రం బడి వదిలేటప్పటికి బడిబయటనే ఉండే వాడు.అలా మొదలైన మా “తాతయ్య ప్రేమ”
నాకు ఏమి కావాలో, కావాలన్నా అడిగిన వెంటనే కొనిపెట్టేవారు. ఏపండగ వచ్చినా కొత్త బట్టలు కుట్టించేవారు .ప్రతి సీజన్ లో దొరికే పళ్ళు తెచ్చే వారు.ప్రతి రోజు రాత్రిపూట ఇంటికి వచ్చేటప్పుడు మిఠాయి పొట్లం కట్టి తెచ్చేవాడు. ఒక వేళ నిద్రపోయి ఉంటే పోద్దన్నే ఒరేయ్ రాత్రి నిద్రపోయావు ఇదిగో నీ మిఠాయి పొట్లం అని ఇచ్చే వాడు. మాఊరి జాతర జరిగేటప్పుడు అయితే నన్ను వదిలెవాడే కాదు. జాతరలో పెట్టే ప్రతి అంగడిని చూపించి,ఫోటోలు తీపించేవాడు .అవి అన్నిటిని అల్బమ్ లో పెట్టేవాన్ని నా స్నేహితులతో ఆడుకోవడానికి అమ్మ వద్దన్నా, తాతయ్య పంపేవారు. ఒకసారి అటలోపడి ఆలస్యం అయితే తాతయ్య వచ్చి తీసుకుపోయేవాడు. నా పుట్టినరోజు అయితే తాతయ్య చాలా వేడుక చేసేవాడు .ఊరిలో అందరిని పిలిచి పార్టీ ఇచ్చేవాడు.పిల్లలో క్రమశిక్షణ లోపెట్టే మార్గంలో అమ్మ “ఏంస్నేహితులు? ఏం ఆటలు అని తిట్టేది.అప్పుడు తాతయ్య అమ్మ తో ఏదో చెప్పేవాడు .ఆతర్వాత అమ్మ ఎప్పుడూ కాదన లేదు. స్కూల్ ఆఖరి రోజు మాకు పార్టీ జరుపుకొంటున్నాము అంటే తాతయ్య తీసుకోరా అని డబ్బులు ఇచ్చి పంపెవాడు. నాకు జ్వరం వస్తే తను ఎంతో కంగారు పడిపోయెవాడు డాక్టరు కొంతసేపు నిద్రమేలు కొమన్నాడని నాకు కథలు చెప్పుతూ నాతోనే ఉండేవాడు. నాకు బోలెడుకథలు నేర్పించాడు .కోతి మొసలి గుండెకాయ కాయ,ఎడుగురుకొడుకులు ఎడుచేపలు, ఇలాంటి చాల కథలు నేర్చుకున్న నాకు అప్పుడే తాతయ్య కు ఐ లవ్ యు చేప్పాను. తాతయ్య ఎప్పుడూ ఒకమాటకూడ అనేవాడు కాదు చాల ప్రేమ గా చూసేవాడు. ఎంత ప్రేమగా అంటే మానానమ్మని కూడా అంత ప్రేమగా చూసిఉండరేమో!నిజంగా తాతయ్య గ్రేట్,నిజంగా తాతయ్య స్నేహం ఎప్పుడూ అనుకోలేదలా!నాకు తాతయ్య మంచి స్నేహితుడు అవుతాడని ఎప్పుడూ అనుకోలేదు. తాతయ్య కు నేను సుఖంగా సంతోషంగా ఉంటే తనకి ఎంతోఇష్టం తాతయ్య నా సరదాలను తనతో పంచుకోవాలని తాతయ్య ఉబలాటం ఈ భావాన్ని ఏమంటారు? ప్రేమ? అవును ప్రేమ అంటున్నాం కదా! మరి తాతయ్య స్నేహం ప్రేమ కాకపోతుందా?
తాతయ్య నాకోసం పుట్టినప్పటి నుండి నేను అలిగి ఇల్లు వదలి పోయే దాక నన్ను కంటికి రెప్ప లా నాతో గడిపిన రోజులు పెంచిన మమకారాన్ని ప్రేమను ఏమంటారు? ఒకరుని ఒకరు కావాలను కొవడం “ప్రేమ”అవకాశవాదం స్వార్థం చింతన లేని స్నేహం ప్రేమ అయితే మాది ప్రేమే అది తాతయ్య మనవడి ప్రేమ తాతయ్య ఐ లవ్ యు! ఇప్పుడు నాలుగు రోజులు ప్రేమించుకొని తల్లిదండ్రుల్ని కాదనుకుని వెళ్ళి పోయి మరలా విడిపొయే ప్రేమ కాదు ఈ ప్రేమ పేగుబంధంకాక పోయిన చాకిన ప్రేమ తాతయ్యది.నేను పుట్టిన రోజే మాతోలిప్రేమ ప్రారంభమైంది.
మేము ఇద్దరం ఒకటే ఈ రోజు తాతయ్య నాకు దూరం కావడానికి నేనే “తాతయ్య ప్రేమ” కాదని వెళ్ళి పోయా తాతయ్య నామీద దిగులు తో చనిపోయారని ఊరంతా అంటుంది కాని మా ప్రేమ ఈ జన్మలో సమాప్తం కాదు” ప్రేమ ఎంత మధురం”అని లోకంలో ప్రతి ఇంటి లో తాత మనుమళ్ళ ,మనుమరాళ్ళ అందరూ గుర్తుగాచెప్పకుంటారు. నాకు తెలుసు మా తాతయ్య మనవడు అనుబంధం అందరి మనసు ల్లోశాశ్వతం. తాతయ్య ఒక్క సారి తిరిగి జీవించు నీవు ఎవరి కోసం బెంగతో మరణించావో వాడే నీ ముద్దుల మనవడు శివరావు నీకోసం తిరిగివచ్చి నీ కాళ్ళ మీద పడి క్షిమించమని కోరుకొంటాడు అని విలపిస్తూశివరావు తాతయ్య ను వేడుకొన్నాడు. అందరిని చూసి స్వర్గనికి వెళ్ళిపో అంటూ నామనసు పిచ్చిగా అక్రోశిస్తోంది.ఇంతలో ఎవరో ప్రక్కకు వచ్చినిలబడినట్టు అనిపించి తలెత్తిచూసా. నాన ఓరే శివరావు ఎప్పుడోచ్చారా ఎటూ పోయావురా అదిగోర మీ అమ్మ చూడవే ఇంతకాలనికి మన పైన
దయకలిగిందే వీడికి అంటూ ముగ్గురు వాటేసుకొని బోరుమని తాతయ్య శవం దగ్గరకుపోయి నీమనవడు వచ్చాడయ్య అని ఎడవసాగారు.”మిమ్మల్ని మర్చిపోతే నా అంత కృతఘ్నుడు మరోకరుంటారా? నాన అన్నాడు శివరావు. గుండెలు వణికించే ఇంత దుఃఖంలో కూడ ఒక వ్యక్తి వచ్చి తాతయ్య విగతశరీరాన్ని అఖరి ప్రయాణానికి సిద్ధమైంది అని చెప్పే లోగ, అంతలో పెద్ధ లు చూడు శివరావు బతికున్న రోజులు నిన్నే తలచుకొని,తలచుకొని నీదిగులుతోనే చనిపోయిన తాతయ్యకు నీ చేతులు మీదుగా దహన సంస్కారాలు జరిపించు నాయన శివరావు నీ తాతయ్య ఆత్మ శాంతి కలుగుతుంది అన్నమాటలకు శివరావు మనసులో దాగిఉన్న దాచుకున్న కన్నీటికుండ ఒక్క సారిగా బ్రద్దలైయింది.తాతయ్య “ప్రేమ” ఎంత మధురం “

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!