బావా మరదళ్ల ప్రేమ

(అంశం:”ప్రేమ ఎంత మధురం”)

బావా మరదళ్ల ప్రేమ

రచన:సుజాత.కోకిల

“అందమైన పల్లెటూరు చుట్టూ పొలాలు చెన్లు మధ్యలో ఇరుకైన దారి హాయ్ హాయ్ అంటూ ఎడ్లబండి పోతుంటే ఎడ్లకు కట్టిన గంటల సౌండు మాకెంతో ఉత్సాహాన్ని తెప్పించేది మేము ఎంతో హుషారుగా వెళ్లే వాళ్లం ఆగు తాతా అంటూ మధ్యలో ఆగి పెసరుచెన్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి పెసరు కాయలు కోసుకొని మళ్లీ బండిలో ఎక్కి కూర్చొని తినుకుంటూ వెళ్లేవాళ్లం.

ఆ హుషారు ఆ సంతోషం మళ్లీ రాని రోజులు ప్రతి పండగలకి వెళ్లేవాళ్లం! అమ్మమ్మ తాత అక్కలు అందరం చాలా సరదాగా ఉండే వాళ్లం అత్తయ్యలు
మామయ్యలు పిన్ని బాబాయిలు ఇంక మేం పిల్లలమంతా పదిహేనుమంది దాక అయ్యేవాళ్లం.

అది పెద్ద పెంకుటిల్లు చతురస్రాల భవంతి మా ఇంటి చుట్టూ పూలచెట్లు కూరగాయల చెట్లు అందంగా ఉండేవి మేము ఏవీ కొనేవాళ్ళం కాదు అన్ని ఇంట్లో పండిన పండ్లు కూరగాయలను వాడేవాళ్లం.ఇంటి నిండా పాలేర్లు ఆవులు ఎడ్లు అన్నీ ఉండేవి.మా ఇంట్లో పెద్ద మోటబావి ఉండేది.మమ్మల్ని అటువైపు పోనిచ్చే వాళ్ళు కాదు?

“చింత చెట్టు ఎక్కి చింతకాయలు చింతచిగురు కోసుకొని ఉప్పందుకుని తింటుంటే అబ్బ ఆ రుచే వేరు.దారి పొడవున వస్తున్నంత సేపు ఆ జ్ఞాపకాలన్నీ నాతో పయనిస్తూనే ఉన్నాయి.అన్ని నాతో కలగలిపిన అనుభూతులు ఓనమాలుగా నా మనసునిండా? కదులుతున్నాయి.ఇంకా ఈ పల్లెటూర్లో మార్పురాలేదు అవే చిన్నచిన్న సందులు చిన్న చిన్న పెంకుటిల్లు అక్కడక్కడా స్లాప్ ఇండ్లు మా ఇల్లు మాత్రం ఇంకా చాలా బాగుంది సవరించడం అవసరం లేదు వంద సంవత్సరాల ఇల్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు.
అప్పటివి చాలా స్ట్రాంగ్ గా ఉండేవి. అమ్మా ఇల్లు వచ్చేసింది దిగండి అమ్మ అంటూ మల్లన్న బండి ఆపాడు.

భాగ్యమ్మ భాగ్యమ్మ పిల్లలు దిగారు ఎదురుగా అమ్మ నాన్న తమ్ముడు అందరూ ఉన్నారు.బాగున్నా అమ్మా రా తల్లి అంటూ నవ్వుతూ ఆహ్వానించింది. ఆండాళ్ పిల్లలు తాత ను చూడగానే తాతయ్య అంటూ తాత చుట్టు చేరారు.పదండిరా అంటూ లోనికి తీసుకు వెళ్లారు.మరదలు వదిన బావున్నారంటూ శాంత మంచినీళ్లు తెచ్చింది. రవి బావున్నావా చాలా రోజుల తర్వాత మనమందరమూ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది.అంది హాయ్ అత్తా అంటూ సంతోష్ సందీప్ వచ్చారు.మీరు బాగున్నారా అంటూ ఆ మీరు ఎలా ఉన్నారు. మీరు బాగా చదువుతున్నారా.అని అడిగింది.నాట్ బ్యాడ్ అన్నారిద్దరు.

కుశలప్రశ్నలు తర్వాత భోజనాలు చేశారు.పై నుండి అక్షర వస్తు ఏం అత్తయ్య బాగున్నారా అంటూ పలకరించింది.మరి బావ రాలేదు ఏంటి అత్తయ్యా అంది.వాడికి తీరికెక్కడుంటుందే అమ్మ ఆఫీసు ఇల్లు క్షణం తీరిక లేదంటే నమ్మవెే పెళ్లయ్యాక కూడా అలాగే ఉంటాడా నవ్వుతూ అంది ఏమోనెే తల్లి నాకేం తెలుస్తుంది.మీ బావను నువ్వే అడుగు అంది నవ్వుతూ మరీ నేను బావను చేసుకోవాలా ఆఫీస్ ను చేసుకోవాలా అంది నవ్వుతూ చమత్కారంగా అక్షర ఏంటి అక్షర అత్తను ఒక్కదానినే చేసి ఆడిస్తున్నావు? రేపు మూడు ముళ్ళు పడనీ నీ ముక్కు పిండి చేతిలో పెడుతుంది.అంది !నవ్వుతూ నానమ్మ”
అబ్బా వచ్చిందిలే బిడ్డకు సపోర్టుగా బుంగమూతి పెడుతూ అంది! అక్షర

ఏంటి నానమ్మ నేనేదో తమాషా కంటే నీవు కూడా ఏంటి నేను కూడా తమాషాకన్నాను లేవెే ఇక్కడే ఉన్నావేంటే అత్తాకోడళ్లు ముచ్చట పెడుతూ అక్కడ మీ నాన్న పిలుస్తున్నారు. రా భాగ్యం అంది.పద అంటూ తల్లి వెనకాలే వెళ్లింది.భాగ్యం ఇలా రామ్మా భాగ్యం ఇలా వచ్చి కూర్చో అల్లుడు గారు మీరు కూడా కూర్చోండి?
అన్నారు తను కూర్చుంటూ ఫర్వాలేదు మామయ్య మీరు కూర్చోండి హాల్లోకి అందరు కూడా వచ్చారు.
మీతో ఒక విషయం మాట్లాడాలి అల్లుడుగారు అన్నారు. మామగారు ఏ విషయం గురించి చెప్పండి మామయ్య గారు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఏంటా విషయం అన్నట్టుగా అసలు ఎవరికీ తెలియదు ఈ విషయం అందుకే అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

భాగ్యం నీ కొడుకు రఘు వీరికి అక్షరను ఇచ్చి పెళ్లి చేయాలను కుంటున్నాను మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అన్నారు.నాన్నగారు మీ మాట ఎందుకు కాదంటాను.నాన్నగారు మనం చిన్నప్పటి నుంచి అనుకున్న విషయమేగా నేను చేసుకోకుంటే ఇంకెవరు చేసుకుంటారు మరీ రఘువీర్ అభిప్రాయం ఏంటమ్మా
వాడి కూడా ఇష్టమే నాన్నగారు ముందు మీ అభిప్రాయం తెలుసు కోమన్నాడు ఆ తర్వాత తన అభిప్రాయం చెప్తాను అన్నాడు ఇంకేముంది శుభం
మీ అందరికీ కూడా ఇష్టమే కద అని అందర్నీ చూస్తూ అడిగాడు.ఇష్టమే అన్నట్టుగా తలలూపారు.

ఇంకేంటి ఈ నెలలోనే పెళ్లి ముహుర్తాలు పెట్టుకుందాం
సరే నాన్నగారు వాడికి చెప్పి పిలిపిస్తాను అందరూ సంతోషంగా ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు.
ఇంటి పురోహితుడు వచ్చారు వచ్చే ఏకాదశి నాడు బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది అని అన్నారు.
అదే ముహూర్తం ఖాయం చేసుకున్నారు.

పెండ్లి పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి చక్కటి పల్లెటూరి వాతావరణంలో పెళ్లి చేయాలని అనుకున్నారు.అసలే కరోనా సిటీలో చేస్తే బావుండదని
అసలైన ముఖ్యులను పిలుచుకుని సింపుల్గా చేయాలన్నారు నాన్నగారు అదిగో రఘువీర్ వచ్చాడంటూ అందరూ చప్పట్లు కొడుతున్నారు
ఏం నాయనా బావున్నావా అంటూ తాత పలకరించాడు ఆ బాగున్నాను తాతయ్య అంటూ కాళ్ళకు నమస్కరించాడు కళ్యాణప్రాప్తిరస్తు అంటూ దీవించారు తలుపు చాటునుండి అక్షర భావను చూస్తుంది.సిగ్గు పడుతూ రఘువీర్ కళ్లు అక్షర కోసం వెతుకుతున్నాయి.ఎక్కడ ఉంది అనుకుంటూ దిక్కులు చూస్తున్నాడు.తలుపు చాటుగా కనిపించింది.అమ్మ దొంగా ఇక్కడున్నావా అనుకుంటూ నవ్వుకున్నాడు తనలో తనే బావకు మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది.
బాగున్నావా అంటూ కళ్లతోనే పలకరించాడు తను కూడా కళ్ళతోనే ఊఁఅంది!రఘువీర్అక్షర పెండ్లి రంగరంగ వైభవంగా జరిగింది.బావా మరదళ్ల ప్రేమ ఎంతో మధురం మూడుముళ్ల బంధంతో విడిపోని బంధంగా మారింది ఆ బావా మరదళ్ల ప్రేమ ఎంతో మధురం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!