(అంశం:” ప్రమాదం”)
ప్రమోదం ❤️ప్రమాదం
రచన::ఆర్కా
ఓ… చెలికాడా!!!
నీ కౌగిట నేను పరవశిస్తాను…
నీ ముద్దులో కరిగిపోతానును…
నాలో నిన్ను దాచుకుంటాను…
కానీ!!! నీకు తెలుసా???
నీవన్నా నాకెంత భయమో అని???
హా హా హా హా హా…
నువ్వు నా దగ్గరకొస్తే…
ఘటైన నీ ముద్దులో…
నా పెదవులపై వెచ్చని నెత్తురు చూడ…
నీ మగసిరికి ఆనందమైతే…
నీ చూపుల తాకిడి నా మేనిని తాకగా…
నా గుండె ఆగునని నా అలజడిని…
నీవెరుగుదువా???
మెడవొంపులో నీ పంటి గుర్తు…
నాకు బాధ కలిగిస్తే నీకది ప్రమోదమైతే…
నేను కొరికిన చాలు చక్కిలిగిలిలా…
నవ్వే నువ్వుంటే నాకు ప్రమాదమని…
నీవెరుగుదువా???