(అంశం: ” పెంకి పెళ్ళాం”)
పెంకిదే కానీ…బంగారం
రచన :: క్రాంతి కుమార్
నవ్వే నన్ను చూసి ఏడిపిస్తుంది
మనసు బాధ కనుగొని నవ్విస్తుంది
అల్లరి చేస్తే చిన్నపిల్లాడిలా ఏంటని కసురుతుంది
తన అల్లరి ఏంటంటే నేనింతే అంటుంది
అలిగిన వేళ బుజ్జగిస్తే వెళ్ళమంటుంది
దూరం వెళ్తుంటే దగ్గర లేనని గోలచేస్తోంది
అర్థం చేసుకోలేదని మారాం చేస్తుంది
దగ్గరగా వెళ్తే దూరం పెడుతుంది
సంతోషంగా ఉన్నప్పుడు మౌనం ఉంటుంది
కష్టాల్లో ఉంటే సంతోషమే లేదని గగ్గోలు పెడుతుంది
నేనేం చెప్పినా తప్పని తిడుతుంది
తనని ఒప్పంటే నువ్వేం చేస్తున్నావంటుంది
అన్ని బాధ్యతలు తనే తీసుకోవాలంటుంది
నేనే ఏం చేయలేదని భోరుమని ఏడుస్తుంది
తిక్క చూపే పెంకి పెళ్ళానికి..
లెక్క తెల్చలేని మొండి మొగుడిని నేను.