చిన్ననాటి స్నేహం

(అంశం : నా అల్లరి నేస్తం)                                                             చిన్ననాటి స్నేహం

రచన ::యం.టి.స్వర్ణలత

ఏడేళ్ళ వయసులో ఎదురింటి పిల్లాడితో
ఏమిటే ఆ స్నేహమంటు బామ్మతిడుతున్నా
మామిడి తోటనుండి కోసుకొచ్చిన పిందెలను
కాకెంగిలితో పంచి ఇచ్చె నేస్తానికై పరుగులు
అమ్మ చేసిన సున్నుండలు లంగాలో దాచుకెళ్తె
నువ్వు ఇంట్లో తినమంటూ కాజేసిన నా నేస్తం
ఆటల్లో అమాయకురాలినిచేసి ఓడించి గెలిచి
గేలిచేస్తు గెంతులేసి ఆటపట్టించే అల్లరి నేస్తం
ఉడుక్కుంటె బ్రతిమాలి బుజ్జగించె నానేస్తం

పరువపు తొలినాళ్ళలొ దొంగచూపు చూస్తూ
దొ‌రికిపోయి తడబడి తప్పించుకుని పోయి
ఎవరితో మాట్లాడినా గొడవపడి వాదించి
మాట్లాడనంటూ అలిగిపోయి మారాం చేసి
మరునాడే తిరిగివచ్చి క్షమాపణలు చెప్పీ
అన్నింటా తోడుగా తానున్నాననీ భరోసా ఇచ్చి
మెల్లమెల్లగా నా మనసును కొల్లగొట్టిన నేస్తం
నిన్ను వదులుకోలేనంటూ భర్తగ మారిపోయి
అప్పుడు ఇప్పుడూ నీ నేస్తం నేనేనంటూ
అంతులేని అల్లరితో నన్నల్లుకు పోయాడు

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!