పెద్దలు కలిపిన ప్రేమ

(అంశం::” ప్రేమ”)

పెద్దలు కలిపిన ప్రేమ

రచయిత :: శ్రీదేవి శ్రీనివాస్ కొప్పిశెట్టి

వరుణ్ డిగ్రీ పూర్తి చేసాడు.
తన మేనమామ అయిన భాస్కరరావుకి అన్ని పనుల్లో సాయంగా ఉంటున్నాడు
వరుణ్ భాస్కరరావుకి చెల్లెలి కొడుకు. వరుణ్ కి చిన్నప్పుడే తండ్రి చనిపోయిన కారణంగా వరుణ్ కి తండ్రి లేడు గానీ వెనుక ఆస్తి పాస్తులు మాత్రం బాగానే ఉన్నాయి
.వరుణ్ తల్లి సరోజిని భర్త చనిపోయిన తరువాత కొడుకు,వరుణ్ కూతురు మల్లికతో కలిసి తన అమ్మగారి ఊరిలోనే ఉంటుంది.
మల్లిక ఇంటర్ చదువుతుంది భాస్కరరావు ఆలోచన ఏమిటంటే మేనల్లుడిని తన కూడా తిప్పుకుంటూ తన కూతురైన వసంతకిచ్చి వివాహం చేయాలని.
వరుణ్ కూడా మంచివాడు
ఎవరో తెలియని వాళ్ళనిచ్చి పిల్లకు పెళ్ళిచేస్తే ఏమో ఎలా ఉంటుందో పిల్ల బ్రతుకు .అదే తన చెల్లికి కోడలైతే పిల్లని కడుపులో పెట్టుకుని చూసుకుంటుందనీనూ
సరోజిని కూడా వసంత, వరుణ్ లకి పెళ్ళి చేయాలనే ఆలోచించేది .

ఒకరోజు మల్లిక ఫ్రెండ్ వాసవి వాళ్ళ అమ్మ గారికి యాక్సిడెంట్ అయితే ఆవిడను చూడడానికి మల్లిక అన్నయ్యా హాస్పిటల్ కి తీసుకెళ్ళమని నన్ను అడిగింది.నన్ను.
సరేనని మల్లికను హాస్పిటల్ కి తీసుకెళ్ళాను .
అక్కడ మల్లిక ఫ్రెండ్ వాసవిని చూసిన వెంటనే నాకు మనసులో ఏదో ఒకలాంటి ఫీలింగ్.
ఇది వరకు ఎంతమంది అమ్మాయిల్ని చూసినా కలగని ఫీలింగ్ .
ఆఖరికి వసంతని ఎన్నిసార్లు చూసినా ఒక్కసారి కూడా కలగని ఫీలింగ్
నేను తనని చూడడం ఇదే మొదటిసారి .
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో ఒక్కసారి చూస్తేనే ప్రేమ పుడుతుందా అని నేను అనుకున్న సందర్భాలెన్నో . కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఇది ప్రేమేనేమోనని. .
మేము.కొంతసేపు అక్కడ ఉండి బయలుదేరి వస్తుండగా వాసవి కూడా మాతో పాటు గుమ్మం వరకు వచ్చింది వెళతానని చెబుతున్న నా వైపు కన్నులెత్తి చూసింది
నేను కూడా అదే సమయంలో తనని చూస్తుండడంతో ఇద్దరి కనులు ఒకేసారి కలిసాయి .
తన కనులు నాకేదో చెబుతున్నట్టుగా అనిపించింది నాకు.
నేను ,చెల్లి ఇంటికి వచ్చామన్న మాటే గానీ ఆరోజు నుండి నాకు తనపైనే ధ్యాస .
తనతో జీవితాన్ని పంచుకోవాలని ఆశ రోజు రోజుకి నాలో పెరిగిపోసాగింది కానీ నాకు వసంతనిచ్చి పెళ్ళి చెయ్యాలని అమ్మ, మావయ్యల ఉద్దేశ్యం గుర్తుకొచ్చి మనసు తన వైపు నుండి మళ్ళించుకోవాలని ప్రయత్నించినా సాధ్యపడేది కాదు .
.వాసవి వాళ్ళ అమ్మ గారికి నయం అయి ఇంటికి తీసుకెళ్ళారని తెలిసీ పలకరించడానికి నేను వాళ్ళింటికి వెళ్ళాను
మరలా నేను ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు అమ్మకి మందులు తీసుకోవాలి మందుల షాపు వరకు వస్తానని నాతోపాటు బయలుదేరి వచ్చింది వాసవి .
ఇద్దరం నడుచుకుంటూ వెళుతున్నాం .మౌనంగా .
తనే చొరవ చేసి మాట్లాడడం మొదలు పెట్టింది
మిమ్మల్ని మొదటిసారి చూసినపుడే మీరు నా భర్త అయితే బాగుండును అనిపించింది
మీ కళ్ళలోకి చూసిన తరువాత మీకు నేనంటే ఇష్టమేనేమో అనిపించింది. అందుకే ఎవరో ఒకరు చొరవ చెయ్యకపోతే కుదరదని నేనే నా మనసుని మీ ముందుంచుతున్నాను. అది ఇష్టంగా స్వీకరిస్తారనే నేననుకుంటున్నాను అన్నది .
నాకైతే ఆ క్షణం కాలం అలా ఆగిపోతే బాగుండుననిపించింది.
కానీ అమ్మ, మావయ్య ఉద్దేశ్యం గుర్తుకొచ్చి అదే మాట తనతో చెప్పాను.
ఆ మాటకి తను పొంగుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ సారీ మిమ్మల్ని తప్పుగా అర్ధం చేసుకున్నాను ..
మనసులో ఏమీ పెట్టుకోండి అంటూ వెనుదిరిగి వెళ్ళిపోయింది
కళ్ళ వెంట వస్తున్న నీరు తుడుచుకోవడం నా దృష్టికి దాటిపోలేదు
ఆరోజు నుండి ఏమీ పని చేయలేక ,తిండి సరిగా తినలేక పిచ్చెక్కిన వాడిలా అయిపోయాను నేను.

నన్ను గమనించిన మాపయ్య
ఒకరోజు రాత్రి నేను పడుకున్న మంచం దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుని
ఏరా వరుణ్ ఆరోగ్యం బాగోలేదా రోజు రోజుకి నీరసించిపోతున్నావు అన్న మాటకి నేను అదేం లేదు మావయ్యా బానే ఉంది అని బొంకాను. దానికి ఆయన అయితే ఎవరినైనా ప్రేమించావా అని మావయ్య ఒక్కసారే సూటిగా అడిగేసరికి నేను ఊహించని ఆ ప్రశ్నకి బిత్తరపోయి కంగారుపడుతూ అబ్బే అదేం లేదు మావయ్యా అయినా నాకు వసంతను పెళ్ళి చేసుకోవాలని తెలుసుకదా వేరెవరినో ఇంకెలా ప్రేమిస్తాను అన్నాను
దానికి మావయ్య ఎవరికైనా ఎవరిమీదనైనా ప్రేమ ఎప్పుడు, ఎలా, ఎందుకు కలుగుతుందో ఎవ్వరం చెప్పలేము. .
హద్దులు పెట్టడానికి ప్రేమ అనేది మనసుకి సంబంధించిన విషయం .
శరీరానికి సంబందంచిన విషయం కాదు కదా.
పెద్దవాళ్ళం మీ బాగుకోరి ఎన్నో అనుకుంటాం
కానీ మీరు మా మాట కోసం మనసొకచోట ,మనువొకచోట అయితే జీవితం నరకంలా మారుతుంది
రెండు చేతులూ కలిస్తేనేగా చప్పట్లు కొట్టగలం
. పెద్దల కోసం ఆలోచించి మన ప్రేమను విఫలం చేసుకుంటే
విఫలమైన ప్రేమ జీవిత కాలం మారని గాయం లాంటిది గుర్తుకొచ్చినప్పుడల్లా ఆ గాయం రేగి బాధపెడుతూనే ఉంటుంది .
అనుభవంతో చెబుతున్నాను నేను చేసిన తప్పు మరలా నీవు కూడా చేయకు
నేను కూడా ఒకమ్మాయిని ప్రేమించి ,పెద్దలు బాధపడతారేమోనని ఆలోచించి వాళ్ళు కుదిర్చిన పెళ్ళి చేసుకుని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను
ఆ బాధ గుండెలను పిండేస్తూ ఉంటుంది
నేను పడిన బాధ నువ్వు పడకూడదు
నీ గురించి అంతా నాకు తెలుసు మీ అమ్మను నేను ఒప్పిస్తాను అన్నాడు మావయ్య.
ఇంతలో అమ్మ వాడు మన మాటకి విలువ ఇచ్చినప్పుడు వాడి ప్రేమకి కూడా మనం గౌరవం ఇవ్వాలి కదా అన్నయ్యా
నాకేమీ అభ్యంతరం లేదు అంది లోపలికి వస్తూ
ఇంతలో మా చెల్లి వాసవికి ఫోన్ చేసి ఈ శుభవార్త నీ నోటితో నువ్వే వదినకు చెప్పు అని ఫోన్ నా కందిస్తూ .
అంతా కలయో నిజమో తెలియని అయోమయంగా అనిపించింది నాకు . విషయం వాసవికి చెప్పా పెళ్ళికి సిద్ధంగా ఉండమని
అది విన్న.వాసవి కూడా ఎగిరి గంతేసినంత పని చేసింది
ఆ క్షణంలో మావయ్య, అమ్మ ప్రత్యక్ష దైవాలుగా అనిపించారు నాకు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!