నా అర్ధాంగి

(అంశం: ” పెంకి పెళ్ళాం”)

నా అర్ధాంగి 

రచన :: స్రవంతి

నా మనసు అర్థమెరిగినది
నా అర్ధాంగి
నా చిలిపి నేస్తం నా అర్ధాంగి.

మా చిలిపి దోబుచులాటలలో ఓడితే చిన్న పిల్లలా ఏడుస్తుంది నా సతి.

ఆనందపరిచే బహుమతులు తీసుకువస్తే నచ్చలేదని బుంగమూతి పెడుతుంది
నా భార్యామణి.

అడిగిందల్లా కావాలి అని గగ్గోలు పెడుతుంది నా పెంకి పెళ్ళాం

ఇంటి బాధ్యతలు చక్కగా నెరవేరుస్తుంది నా ఇంటి ఇల్లాలు.

తను అలిగిన వేల రుసరుస లాడే చూపులతో నన్ను బందిని చేస్తుంది నా వయ్యారి భామ.

ఎప్పుడు వితండవాదం చేస్తది
నాకు బాధ్యతలే తెలివంటు బోరుమంటు విలపిస్తుంది
నా పత్ని

తాను మెచ్చిన తనకు నచ్చిన పనులు చేయాలి అంటుంది కోపగిస్తే మౌనం ప్రకటిస్తుంది
నా ఆలి

నేను కలత చెందకుండా చూస్తుంది నా కళత్రము

గృహమే కదా స్వర్గసీమ అని మైమరిపించేలా చేస్తుంది
నా గృహిణి

ప్రేమానురాగాలను కురిపిస్తూ, గారాబాలు వొలక బోస్తు మురిపిస్తుంది నా పెంకి పెళ్ళాం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!