చాదస్తాలన్నీ నిజాలే

(అంశం:: “చాదస్తపు మొగుడు”)

చాదస్తాలన్నీ నిజాలే

.రచయిత :: నామని సుజనాదేవి

ప్రపంచం పబ్బులంటుంటే
నా మొగుడేమో భజనలంటాడు

ఊరంతా చెప్పులేసుకుని తినే ‘బఫే’ భోజనమంటే
నా మొగుడేమో కాళ్ళు చేతులు కడుక్కుని తినే ‘బంతి’ భోజనమంటాడు

ఊరంతా ఎ సి పెట్టుకుంటే
నా మొగుడు వేపచెట్టుగాలి కావాలంటాడు

ఊరంతా ఫ్రిడ్జ్ కావాలంటే
నా మొగుడు కుండ కావాలంటాడు

ఊరంతా మిక్సీ వాడితే
నా మొగుడు రుబ్బురోలు వాడమంటాడు

ఊరంతా ఫేస్బుక్ చూస్తె
నా మొగుడు పుస్తకం చదవాలంటాడు

ఇంటి ముందు పర్మనెంట్ పెయింటింగ్ వేద్దామంటే
రంగుల రంగవల్లులు దిద్దాలంటాడు

ఊరంతా వృద్ధులను అనాధాశ్రమానికిస్తుంటే
అనాధ వృద్ధులకు ఆత్మీయుడవుదా మంటాడు

ఊరంతా అటాచ్ బాత్రూమ్స్ కట్టుకుంటే
నా మొగుడు ఇంటి బయట మరుగుదొడ్లు ఉండాలంటాడు

ఊరంతా పిలుపులను మామ్, డాడ్,అంటీ,అంకుల్ గా మారిస్తే
నా మొగుడు అమ్మ,నాన్న,అత్త,మామ గా ఆత్మీయంగా పిలుస్తాడు

ఊరంతా సబ్బులు, షాంపూ లతో స్నానం చేస్తే
నా మొగుడు సున్నిపిండి, కుంకుడు కాయలు కావాలంటాడు

ఊరంతా గడపలకు పెయింటింగ్ వేస్తె
నా మొగుడు పసుపురాసి బొట్టు పెట్టాలంటాడు

ఊరంతా మందుల షాపుల ముందు వరస కడితే
నా మొగుడు ఆయుర్వేదమంటూ వంటిల్లె ఔషదాలయమంటాడు

ఊరంతా వస్తువులను ప్రేమిస్తే
నా మొగుడు మనుషులను బంధాలను ప్రేమించాలంటాడు

అదేం చిత్రమో గాని
ఊరంతా ఒకదారయితే
ఉలిపిరి కట్ట దో దారని

ఊరంతా ఒకదారయితే
నా మొగుడి దో దారయినా
చిత్రంగా ఇపుడు అందరూ
ఆయన దారే రహదారి అంటున్నారు

అప్పడు ఆయన్ను చాదస్తామన్న వారే
ఇప్పుడు ఆయన చెప్పిందే వేదమంటున్నారు
మొత్తానికి ఆయన చెప్పినవన్నీ చాదస్తాలే
అయినా ఆ చాదస్తాలన్నీ నిజాలే.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!