(అంశం:: “చాదస్తపు మొగుడు”)
ఎలా వేగను..
రచయిత :: సావిత్రి కోవూరు

ఏమి చేయను దేవుడా ఏమి చేయను, ఈ చాదస్తపు మొగుడితో ఎలా వేగను
తాళం సరిగ్గా వేసావా అంటడు, వేశానని నే చెబితే మళ్లీ చూసొస్తానంటాడు.
సరేలే అని నేనంటే, వెనక్కొచ్చి వేసే ఉంటావ్ లే అంటాడు.
మనోడికి టికెట్ దొరికిందా అంటాడు, దొరికింది వస్తున్నాడంటే,
ఎందుకైనా మంచిది కనుక్కుంటానంటాడు, సరేలే అని నేనంటే,
సరేలే నీకు చెప్పాడుగా దొరికే ఉంటుందంటారు ఏమి చేయను దేవుడా ఏమి చేయను
బెర్త్ దొరికిందా అంటాడు, దొరికిందని నేనంటే
ఎందుకైనా మంచిది కనుకుంటానంటాడు,
కానీయండని నేనంటే సరేలే నీకు చెప్పాడుగా అంటాడు.
పక్కింటి కుర్రాడేంటే ఇటే చూస్తున్నాడంటాడు, తూర్పు ఇటుగా సూర్య నమస్కారాలు అని నేనంటే,
ఒకసారి వెళ్లి దులిపేసి వస్తానంటడు,
ఇంతలోనే సూర్యనమస్కారాలే అయి ఉంటాయంటాడు.
ఎదిరింటి వాళ్ళెప్పుడు అటుమళ్ళి కూర్చుంటారెందుకు
మనతో ఏమన్నా ఇబ్బందాని అడుగుతానంటాడు
వాళ్ల కటు టీవీ ఉందండి, అందుకే అటు తిరిగుంటారు అని నేనంటే,
సరేలే వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం ఎటు తిరిగితే మనకు ఎందుకంటాడు
పక్షులేంటి రావట్లేదు గింజలేయమంటాడు,
అంతలోనే వద్దులేవే, బాల్కనీ అంత చెత్త అవుతుందంటాడు.
మీ ప్రశ్న జవాబులతో నా తల బద్దలు అవుతుంది అంటే,
కుడివైపా, ఎడమవైపా, కొంచమేనా, చాలానా
కాఫీ కావాలా? లైట్ కాఫీనా, స్ట్రాంగ్ కాఫీనా అంటాడు.
అమృతాంజన మీయనా,టాబ్లెట్ వేసుకుంటావా అంటాడు.
అవన్నీ వద్దు మీరు వెళితే, తలుపు వేసుకుంటా నంటాను.
