నీ రాక కై

నీ రాక కై

రచన:: పి. వి. యన్. కృష్ణవేణి

కళ్లు మూతలు పడుతూ ఉన్నాయి. మద్య మద్యలో మెలుకువ వచ్చేసరికి, స్వరూప్ నా దగ్గరగా ఉన్న ఒక కుర్చీలో కూర్చుని, నన్నే చూస్తూ ఉన్నాడు.

ఏమి కాదు, అన్నీ నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతాయి. భయపడకు. నీకు ఏమి కాలేదు. జస్ట్ ఒక బుల్లెట్ పేలి, ఎక్కువ రక్తం పోవటం వల్ల, స్పృహ కొల్పోయావు. అంటూ ఓదార్చాడు.

నాకు నిన్న జరిగిన సంఘటన కళ్ల ముందు కదలాడుతుండగా, మళ్లీ కళ్ళు మూసుకుపోయాయి.

                             *****

నిన్ను చూడాలని, నిన్ను చేరుకోవాలని, నీతో నా హృదయం పలికే పదాలు పంచుకొవాలనీ, నీవే ప్రాణం గా బతుకుతున్న నీ రాక కై ఎదురు చూసే, నీ ప్రియతమ ప్రియ సఖిని.

లెటర్ చదివి, చిరునవ్వు పెదవుల పైన నాట్యం చెయ్యగా, భద్రంగా మడిచి, సూట్ కేసులోని బట్టల మడతల్లో
దాచుకున్నా ఆ ప్రియమైన ఉత్తరాన్ని.

ఏంటి సారు ముసిముసి నవ్వులు చిందిస్తూ, తెగ మురిసిపోతున్నారు అంటూ వచ్చాడు నా ఫ్రెండు స్వరూప్.

ఏం లేదూలేరా, లెటర్ అన్నాను చాలా కూల్ గా. వాడు అంతటితో వడులుతాడా?

హా, వీడియో కాల్, ఈ మెయిల్ పంపుకునే ఈ రోజుల్లో లెటర్ వచ్చిందంటెనే ఏదో  స్పెషల్ ఉంటుంది. అందులో ఆ లెటర్ ని అంత భద్రంగా దాచావంటే, అది ఇంకా స్పెషల్.అని ఓరగా నన్ను చూసి కొంటెగా నవ్వుతున్నాడు.

వీడితో లాభం లేదు అనుకుని, అవునురా, స్పెషల్. అది శ్రావ్య రాసింది. అందులో మా పెళ్లి చూపుల గురించి, మేము మాట్లాడుకున్న మాటల గురించి రాసింది. అవి ఫోన్ లో మాట్లాడటం కంటే, ఇలాగే బాగుంటాయి అని తన ఉద్దేశం.

పెళ్లి కి ఎప్పుడు బయలుదేరుతావు అని అడుగుతూ ఉంది.
ఏమి చెప్పాలి. మనకు ఇప్పుడు లీవ్ అడిగే పరిస్థితి కూడా కాదు. వేరే దేశం వాళ్ళు పొంచి ఉన్నారు. యుద్దానికి ఎక్వీప్మెంట్స్ అన్ని కూడా రెడీగా వచ్చినాయి.

ఒక భాద్యత కలిగిన ఉద్యోగం చేస్తు, ఇప్పుడు నా పెళ్లి అని లీవ్ ఎలా పెట్టాలో అర్థం అవ్వక, ఆలోచనతో ఒక నవ్వు నవ్వుకున్నాను అన్నాను.

ఓ ఆదా సంగతి. మా చెల్లి లెటర్ రాస్తే, నాకు చెప్పకుండా, దాచేసుకుంటున్నావు అనుకున్నాను రా బాబు అన్నాడు స్వరూప్.

ఏది ఏమైనా, మన వృత్తి ఏదైనా, మన జీవితంలో ఒక ముఖ్యమైన, అపురూప మైన అంశం మన పెళ్ళి. అందుకే ఎక్కువ ఆలోచించ కుండా, రేపు రాత్రికి నువ్వు బయలుదేరు. ఇంకా వారం రోజుల్లో పెళ్లి పెట్టుకుని, ఇంకా ఇలా ఆలోచించటం చాలా తప్పు. అయినా, ఇలా మిలటరీ లో ఉన్నప్పుడు, మనకి ప్రతి రోజూ ముఖ్యమే. అలాగని మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్లని, వాళ్ళ ఆనందాలని మనం మర్చిపోకూడదు.

నువ్వు ఇప్పుడు ఇలా ఆలోచించి, పెళ్లి వాయిదా వేస్తే, నీ మీదే ఆశలు పెట్టుకుని, ఇంకా వస్తావు అని నీ కోసం కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని ఎదురు చూసే, అమ్మ నాన్న, నిన్నే ప్రాణం గా భావించే శ్రావ్య  పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. అని నాకు ఫుల్ గా క్లాసు పీకేసాడు.

           *****

కళ్లు తెరిచి నా చుట్టూ చూసుకుంటూ ఉండగా, డాక్టర్ వచ్చి నన్ను ఛెక్ చేసి  స్పృహలో కి వచ్చారు, కాబట్టి నో ప్రాబ్లెమ్ అని చెప్పి, స్వరూప్ తో ఏదో మాట్లాడి, వెళ్లిపోయారు.

స్వరూప్ లోపల కు రాగానే, ఒక ఫోన్ కాల్ వచ్చింది. హా, బాగానే ఉన్నాడు అంకుల్. ఇప్పుడే స్పృహలోకి వచ్చాడు. మాట్లాడుతున్నాడు. అని చెపుతున్నాడు.

ఏరా,  పెళ్లికొడకా!!!!! లేచావా, మొత్తం మీద భలే హడావిడి చేసావురా, అని నవ్వాడు.

తరవాత, నన్ను ఒక కార్ మాట్లాడి, వాడే దగ్గర ఉండి, మా ఇంటికి చేర్చాడు. మేము వెళ్ళిన తరువాత రోజు నే నా పెళ్లి.

అంటే నేను నాలుగు రోజులు కోమా లో ఉంటే, నన్ను స్వరూప్ చూసుకుంటే, ఇంట్లో పెళ్లి పనులు అమ్మ నాన్న వాళ్లు చూసుకున్నారు.

ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే, అసలు ఎప్పుడు స్పృహ లోకి వస్తానో డాక్టర్ కూడా చెప్పలేదు. కానీ, పెళ్లి రోజుకి లేస్తాడు అని వాడు నమ్మకం గా, ఇంత జరిగినా మా వాళ్ళ కి మైనర్ ట్రీట్మెంట్ అని చెప్పి, పనులు జరిపించాడు.

ఎంటి రా ఇది అంతా అని అడిగితే, మీ ప్రేమ మీద నాకు ఉన్న నమ్మకం రా ఆన్నాడు.

నిజమైతే, ఒక స్నేహం, ఒక ప్రేమ నమ్మకం గా నన్ను బతికించుకున్నాయి అన్నాను నేను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!