చిగురించినమోడు

 చిగురించినమోడు

రచన:: బండారు పుష్పలత

పూజ వంటింట్లో పని చేస్తూ వుంది.” అత్తయ్య అత్తయ్య “అంటూ అత్త గారిని పిలిచింది పూజ. ఏంటమ్మా అంటూ అత్తగారు వచ్చారు. అత్తయ్య ఈ పక్కింట్లోకి ఎవరో అద్దెకు వస్తున్నారట ఈ రోజు అంది పూజ. అవునా నాకు అబ్బాయి చెప్పాడు.అంటూ అవునమ్మాయి ఏం కూరలు చేస్తున్నావు ఈరోజు అంది అత్తయ్య. బెండకాయ వేపుడు., పప్పుచారు, గోంగూర పచ్చడి చేస్తున్నా అత్తయ్య అంది పూజ. అంతలో పక్కింట్లో అలజడి గమనించిన పూజ బయటకెళ్ళి చూస్తుంది. బక్కపలుచన వున్న ఒకావిడ తెల్లచీర కట్టుకొని గుమ్మమునుండి లొపలికి వెళ్లగా వెనకనుండి చూసింది పూజ. కొద్ది సామాను తెచుకుందేమో ఆవిడ అర్ధగంటలో సర్దేశారు ఆ మినీ వ్యాన్ వాడు.సరేలే అనుకుంటూ పూజ లొపలికి వెళ్లి వంట పూర్తి చేసింది.మధ్యాన్న భోజనం తాయారు చేసి భర్తకి బాక్స్ రడీ చేసేంత లో అమ్మ నేను ఆఫీస్ కి వెళ్ళొస్తాను అంటూ శ్రీరామ్ వచ్చి ఆ బాక్సు తీసుకోని “బాయ్ బాయ్ వెళ్ళొస్తాను. వచ్చేప్పుడు మార్కెట్ కు వెళ్లి కూరగాయయలు పట్టుకొస్తాను అంటూ బండి పై వెళ్లి పోయాడు. పిల్లల్ని తాయారు చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి పంపింది పూజ. అత్తయ్య మీరు టిఫిన్ తినీ మందులు వేసుకోండి అంటూ పూరి కుర్మా వున్న ప్లేటు అత్తయ్యకు అందించింది. “నువ్వుకూడా తిను అమ్మాయి” అని అత్త గారు అనగానే తాను ఉంకో ప్లేట్ లో పూరి కుర్మా తెచ్చుకొని అత్తగారి కి ఎదురుగా కూర్చొని ఎదో మాటలు చెపుతూ ఇద్దరు తింటున్నారు. పూజ పెళ్ళై పదిహేను సంవత్సరాలు అవుతుంది. పెళ్ళైన అయిదేళ్లకి వాళ్ళ మామయ్య చనిపోయారు.

$$$

మధ్యాన్నం పూజ అత్తయ్యకి భోజనం వడ్ఢిచ్చి తాను భోజనం చేసింది. అమ్మాయి పక్కింటి అద్దెకు వచ్చిన వాళ్ళు ఎవరో కనుక్కో అంటూ వెళ్లి పడుకుంది పూజవాల్ల అత్తయ్య. పూజ పనులన్నీ ముగించుకొని పక్కింటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కింది. లోపలి నుండి “””ఎవరండీ అండి అంటూ వినిపించిన కంఠం ఎప్పుడో విన్నటు సుపరిచిత కంఠం లాగానే వుంది అని అనుకుంటున్నంతలో డోరు తీసింది. పూజ ఆశ్చర్యం తో నోరు ఏళ్ళబట్టి నువ్వా ””””అంటూ వెళ్లి రాజీని కౌగిలించుకుంటుంది. పూజ నువ్వూ ఎక్కడ అంటూరాజి కూడా ఆశ్చర్యపోయింది. రాజి పూజకి చిన్ననాటి స్నేహితురాలు ఇద్దరు పదవ తరగతి వరకు రాయవరం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. రా పూజ లొపలికి అంటూ తీసుకెళ్లింది రాజి. ఇద్దరు కూర్చొని చిన్న నాటి విషయాలు అన్ని మాట్లాడుకున్నారు. రాజి మరి ఎందుకు ఇలా ఒంటరిగా ”””’!
నీకు పెళ్లిఅయిన్దని విన్నాను అంది పూజ. అవును నాకు పెళ్లి అయి పదమూడు సంవత్సరాలు ఐతుంది. నాభర్త ఒక ప్రయివేట్ కంపినీలో మేనేజరుగా పని చేసేవాడు. పెళ్లయ్యాక ఇద్దరం ఆనందంగానే వున్నాము ఆరు నెలల తరువాత ఒక ప్రమాదంలో రవి చనిపోయాడని ఏడుస్తూ చెప్పింది రాజి. రాజి కూడా బాధపడి కళ్ళకు నీళ్లు తెచ్చుకుంది. రాజి నువ్వు చిన్ననాటి స్నేహితులతో ఎవరితో నైన కాంటాక్టులో వున్నావా అని అడిగింది పూజ లేదునేను ఒక కంపెనీ లో పనిచేస్తుఇక్కడే బతుకు తున్నాను. అమ్మ వాళ్ళఊరికి కూడా వెళ్లడం లేదు అని చెప్పింది రాజి. రాజి వంట ఏమైనా చేసావా అని అడిగింది పూజ లేదు చెయ్యాలి ఇవన్నీ సర్దుకున్నాక చేసుకుంటాను అంది రాజి అయ్యో అలాగా అయితే వుండు నీకు భోజనం తీసుకు వస్తాను అంటూ వెళ్లి పూజ.
పూజ ప్రేమను కాదనలేక చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ పూజ తెచ్చిన భోజనం చేసి ఇల్లు సర్దుకోవడంలో మునిగిపోయింది రాజి. అంతలో సూరీడు పడమరకు పరుగులు పెట్టాడు. పూజ తేనీరు చేసిఅత్తయ్యకు ఒక కప్పు ఇచ్చి తాను తాగుతూ అత్తయ్యతో రాజీగురించి చెప్పింది తనుచిన్ననాటి స్నేహితురాలు అని తన భర్త చనిపోయాడని పాపం రాజి ఒక్కతే ఒంటరి జీవితం గడుపుతుంది అని చెప్పి బాధపడుతుంది. పిల్లలు బడినుండి రాగానే వాళ్ళకి బ్రీడ్ ఆమ్లెట్ చేసి ఇచ్చింది పూజ పిల్లలు తినీ వాళ్ళ ఆటలో మునిగిపోయారు. అత్తయ్య కాలక్షేపం కొరకు భాగవతం చదువుతూ కూర్చుంది. అప్పుడే పూజ అంటూ పిలుపు విపించింది. ఆ వస్తున్న అంటూ వెళ్లి భర్త తెచ్చిన కాయగూరల బస్తా లొపలికి తెచ్చి భర్త ఫ్రెష్ కాగానే టీ తీసుకొచ్చి ఇచ్చి ఇస్తూ “ఏమండి ఇదివిన్నారా అంది ‘ నువ్వు చెప్పంది ఏలా వింటాను అన్నాడు అన్నాడు శ్రీరాం నవ్వుతు ” మీజోకులు ఆపండి అంటూపక్కింటిలో కి అద్దెకొచ్చింది ఎవరోకాదు తన చిన్ననాటి స్నేహితు రాలు రాజి అని ఇద్దరు కలిసి పదోతరగతి వరకు చదువుకున్నా మంటూ చెప్పడం మొదలెట్టింది పూజ. అవునా చాలా ””సంతోషం నీకు మంచి కంపిని దొరికింది అన్నాడు”” అవును వాళ్ళ భర్త ఏంచేస్తాడు అన్నాడు. పూజ కంఠం రుధిరమై పాపం అండి పెళ్ళైన ఆరునెలకే చనిపోయాడు అంది పూజ అయ్యే పాపం ఇలా అన్నాడు రోడ్డు ప్రమాదంలో అంది. అలాగా అంటూ నాకు బయట పని వుంది ఎల్లొస్తాను అంటూ వెళ్ళాడు శ్రీరామ్. పూజ మళ్ళి వంటపూర్తి చేసి అందరికి భోజనాలు వడ్డించింది తిన్నాక రాజి దగ్గరికి వెళ్లి పలకరించి వచ్చి తన స్నేహితుడు కిరణ్ కి ఫోన్ చేసి కిరణ్ ఎలా వున్నారు అందరు పిల్లవాడు బాగున్నాడా అంటూ అడిగింది బాగున్నాం పూజ మీరు ఎలావున్నారు అని అడిగాడు కిరణ్ అందరం బాగున్నాం అంటూ మాట్లాడుతూ కిరణ్ నీకు ఒక మంచి సంభంధం చూసాను మనకు సుపరిచితురాలు అంటూ చెప్పింది. పాపం కిరణ్ భార్యకాన్సర్తోచనిపోయింది.
కిరణ్ పెళ్లి లేటుగా చేసుకున్నాడు ఒక పిల్లవాడు పుట్టాక చనిపోయింది కిరణ్ భార్య. అప్పటినుండి ఆపిల్ల వాన్ని పెంచుకుంటూ ఒంటరిగా బ్రతుకుతున్నాడు తను. అవునా ఎవరా సుపరిచితురాలు అన్నాడు ఆశ్చర్యంగా. మన రాజి అనగానే గుండెలో రాయి పడినంత పని అయింది కిరన్ కి పూజ ఏం మాట్లాడుతున్నావ్ అన్నాడు దానిదేముంది రాజీకి పెళ్లి అవగానే ఆరు నెలలకి రవి చనిపోయాడట పాపం ఒంటరిగా బ్రతుకుతుంది నువ్వు తనని పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితం ఇవ్వాలి అని చెప్పింది పూజ. అయ్యో అవునా అలాగే నేను మా అమ్మతో మాట్లాడి చెపుతాను అన్నాడు కిరణ్. సరే అలాగే వుంటాను అని ఫోన్ పెట్టేసింది పూజ. కిరణ్ తో చెప్పాను రాజీతో మాట్లాడం ఎలా అని మనసులో అనుకోని పడుకుంది పూజ. తెల్లవారి లేచి పనులన్నీ తోందరగాముగించుకొని రాజి దగ్గరికి వెళ్ళింది పూజ. రా పూజ కాఫీ తాగుదాం అంటూ ఆహ్వానించింది రాజి. అవును రాజి కాఫీ తరువాతగాని నీకు మన చిన్న నాటి స్నేహితులంతా గుర్తున్నారా అంది. అవును గుర్తున్నారు అన్నట్టు తలవూపింది రాజి అంతలో పొడుగ్గా నల్లగా వుండే కిరణ్ గుర్తున్నాడా అంది పూజ ఆ గుర్తున్నాడు అన్నట్టు తలవూపింది రాజి. పాపం తన భార్య క్యాన్సర్ తో మరణించింది అంది బాధగా పూజ. అయ్యో అవునా అంది. అవును నువ్వు మళ్ళి పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని అడిగింది డానికి సమా దానంగా తల కిందికి దించుకుంది రాజి. ఏంటి మాట్లాడవు అన్నది పూజ అయినా సమాధానం రాలేదు. వెంటనే అంకుల్ ఆంటీని పిలిపించు నీకు ఒక మంచి సంభందం చూసాను అంది రాజి తడుముకోకుండా. నాకు మళ్ళి పెళ్లా అంటూ లేచింది రాజి. ఏంటి రాజి ఆలా అంటావు అంది పూజ ఇలా ఒంటరిగా ఎన్నాళ్ళు జీవితం గడుపుతావు అని అనగానే చూద్దాం ఆదేవుడి ఇలా అడిస్తున్నాడు అంటూ నిట్టూర్పుగా చెప్పింది. అవును నువ్వు చూసిన ఆ పెళ్లి కొడుకు ఎవరో అంటూ వంటింట్లో కి వెళ్లి కాఫీ కలుతుంది కాఫీకప్పు తెచ్చిపూజ చేతికిస్తూ ఎక్కడుంటాడు అని అడిగింది. అదే మన…. మన…. ఎందుకు కంగారు ఎవరో చెప్పు పూజ అంది రాజి. మరి… మరి…మన స్నేహితుడు కిరణే అందిపూజ. అవునా అనిఅంది రాజీకి స్కూల్ లో తనను చూస్తూ ప్రేమించిన రోజులు తన మనసులో ఆ ప్రేమని దాచుకొన్న రోజులు కళ్ళముందు మెదిలాయి. నీకు ఇష్టమైతే నేను కిరన్ తో మాట్లాడు తాను అంటూ నీ సమాధానం కోసం రేపటి వరకు ఎదురు చూస్తాను అంటూ వెళ్ళింది పూజ. రాజి మనసు ఒక్కసారి కుదేలు అయిపోయింది. తాను క్లాస్ లో తనతో మాట్లాడిన రోజులు ఆ పాత మధురాలన్నీ ఒక్క సారి తలుచుకొని ”’ తన కళ్ళనుండి జాలు వారిన కన్నీళ్లను ఆపలేకపోయింది రాజి. తన మనసు పరిపరి విధాలా ఆలోచిస్తూ ఏది నిర్ణయించుకో లేక వెంటనే వాళ్ళ అమ్మా నాన్న లని పిలిపించి విషయమంతా చెప్పి నిర్ణయం చెప్పమంటుంది రాజి. సరే పూజను పిలువు మాట్లాడుదామని అంటుంది రాజీవాళ్ళ అమ్మ రాజి వెళ్లి పూజ పూజ అంటూ పిలుస్తుంది. పూజ ఏంటి రాజి ఏం నిర్ణయం తీసుకున్నావు అంటూ అడిగింది పూజ. అమ్మానాన్న వాళ్ళు నిన్ను పిలుస్తున్నారు రా అంటూ తీసుకెళ్తుంది. అంటి అంకుల్ మీరెప్పుడొచ్చారు బాగున్నారా అంటూ లొపలికి వెళుతుంది పూజ. అందరు బాగున్నారమ్మ మీరు ఎలా వున్నారు నిన్ను ఎప్పుడో చిన్నప్పుడు చూసాను ఎంతమంది పిల్లలు నీకు
మీవారు ఏంచేస్తారు అని అడగ్గానే నాకు ఇద్దరు అమ్మాయిలు మా అయన లాయర్ అంటి అంటూ సమాధానం చెప్పగానే అంటి నీకు చాలా కృతజ్ఞతలమ్మ మా అమ్మాయికి అమ్మలా అలోచించి సంభంధం చూసావు అంటూ కంటతడి పెట్టుకుంటుంది. అయ్యో అంటి ఆలా అంటారు ఆదినా స్నేహితురాలు అంటూ అవునాంటి కిరణ్ చాలా మంచివాడు తనకు ఒక కొడుకు వున్నాడు రాజీని బాగా చేసుకోగలడు పైగా ప్రభుత్వ ఉద్యోగం కూడా వుంది అని చెప్పింది పూజ. ఓ అలాగా వాళ్ళు ఎక్కడుంటారు అంది. ఇక్కడే హైదరాబాద్ లోనే వుంటారు అంది అయితే అన్నివిషయాలు మాట్లాడు పూజ అంది రాజి వాళ్ళ అమ్మా. సరే అంటూ వెళ్లి కిరణ్ కు విషయం చెప్పి పెళ్లి కి అన్ని సిద్ధం చేసుకోమని చెప్పుతుంది రెండు కుటుంబాలను కలిపి యాదగిరి గుట్టలో పెళ్లి జరిపిస్తుంది పూజ. కిరణ్ రాజి సంతోషంగా కాపురం చేసు కుంటూన్నారు. వాళ్ళకి అమ్మాయి జన్మిస్తుంది. ఆ పాపకి పూజ అని పేరు పెట్టుకొని సంతోషంగా వుంటారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!