అతి తెలివి

అతి తెలివి

రచయిత :: జీ వీ నాయుడు

రాత్రి,8 గంటలు. చిత్తూరు ఆర్టీసీ డిపోలో రిజర్వేషన్ కౌంటర్ రద్దీ గా ఉంది. ” హైదరాబాద్ కు ఒక టికెట్ ” అంటూ 2 వేల నోట్ హ్యాండ్ బ్యాగ్ లో నుంచి బయట కు తీసింది ఓ ప్రయాణికురాలు. ” చేంజ్ లేదు మేడం, ఎక్కడైనా షాపులో అడగండి ” అన్నారు బుకింగ్ క్లర్క్. కొద్దీ సేపు అటు ఇటూ తిరిగి ” సారి సార్. ఎక్కడ లేదు సార్. మీరే ఏదో లాగ చెయ్యండీ ప్లీజ్ ” అని వినయంగా అడిగింది. ” మీరు సైడ్ ఉండండి, చూద్దాం అంటూ తన పనిలో ఉన్నాడు ఆ క్లర్క్.. మరో యువకుడు హైదరాబాద్ కి ఓ టికెట్ సార్ అని 2 వేల నోట్ తీసాడు.” ఇప్పుడే బాబు.. ఆమె కు కూడా అదే చెప్పాను.. చేంజ్ లేదని.. సరే ఒక పని చెయ్యండి. మేడం ఈ అబ్బాయి కి తరువాత చేంజ్ చేసి ఇవ్వండి.. రెండు టికెట్లు ఇందులో తీసుకొంటాను.. సీట్ నెంబర్లు 13, 14 ” అన్నాడు ఆ క్లర్క్…”” థాంక్స్ సార్ “” అని ఇద్దరు ఊపిరి పీల్చుకొని బస్ ఎక్కారు.
” మీరు ఏమి చేస్తున్నారు. ఎక్కడ ఉంటారు. ఏమి పేరు. హైదరాబాద్ లో ఎక్కడ దిగాలి ” ఇలా ప్రశ్నల వర్షం కురిపించింది మేడం. ” నా పేరు అనీల్. మాది చిత్తూరు. నేను హైదరాబాద్ లో కూకటి పల్లె లో ఉంటాను. ఎం టెక్ ఫైనల్. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి రూమ్ తీసుకొని ఉంటున్నాం. మీరు మేడం ” అని ముగించాడు ఆ యువకుడు.” నా పేరు లిల్లీ. ఫ్రెండ్స్ నన్ను ప్రెట్టి అంటారు. నేను హెచ్ ఆర్ హెడ్. ఎర్ర గడ్డ లో ఉంటాను.. మ్యారేజ్ ప్రొపొసల్స్ ఉన్నాయి.. ” అంటూ ఏదేదో చెబుతుంది. అవన్నీ నాకెందుకు అనుకోని నిద్ర లోకి జారాడు అనీల్. బస్ తిరుపతి వచ్చింది. ” మేడం,, నా దగ్గర చేంజ్ లేదు. మీరు దిగి చేంజ్ చేసి ఇస్తే వాటర్ బాటిల్ తీసుకుంటా ” అంటూ తనకు ఇవ్వవలసిన టికట్ డబ్బులు కోసం అడిగాడు. వాటర్ బాటిల్ నా దగ్గర ఉంది. తాగు.. నేను దిగినప్పుడు మార్చి ఇస్తాను లే…ఇంతటి ప్రెట్టి పక్కన ఉంటే.. నీకు చేంజ్ గుర్తు వచ్చిందా.. ” అంటూ తనదైన శైలిలో లిల్లీ మాటల ప్రేమ తోరణాలు లంకించింది. రాత్రి కావడంతో చల్లని గాలికి, రహదారుల మలుపులకు, ప్రేమ పూ బంతుల వలపులతో లిల్లీ, అనిల్ ఫై తలమోపి అటు ఇటూ పడుతోంది. ” నేను ఏమి చెయ్యాలి, దేవుడా, ఏమి చేస్తే నా టికెట్ డబ్బులు ఆవిరవుతాయో.. అసలే కాళీ పర్స్… ఈమె వయలు, వయ్యారాలు… ఏమిటీ దేవుడా… నాకు ఈ శిక్ష.. నా టికెట్ డబ్బులు ఇప్పించండి దేవా.. ” అంటూ అనిల్ తెలియని మైకం లో తళ్లడిల్లు తున్నాడు.. తెల్లవారబోతుంది. అప్పుడే నిద్ర లోకి జారాడు అనిల్. ఎర్రగడ్డ రాక ముందే మెల్లగా బ్యాగ్ పట్టుకొని దిగేసింది లిల్లీ… కొద్దీ సేపటికి డ్రైవర్ యర్రగడ్డ.. దిగేవాళ్ళు ఉంటే రండీ.. అని కేక వేస్తుంటే లేచాడు అనిల్.. మేడం లేదు. సీట్ ఖాళీ. ” అయ్యో.. నా అతి తెలివి మండా.. నేనెందుకు ఒప్పుకోవాలి. జాయింట్ టికెట్ కి ” అంటూ చేసిన తప్పుకు లెంపలేసుకున్నాడు అనీల్.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!