స్వర అమృతం”బాలు”
రచయిత :: జాధవ్ ముకుంద్ రావు
బాల సుబ్రహ్మణ్యం
పూర్వజన్మ పుణ్యం
అమ్మానాన్న హృదయం
బ్రహ్మ ద్వారా లిఖితం !!
తెలుగు భాష ప్రాణం
మాతృభాషల ఋణం
పాటలు అంటే ప్రాణం
కంఠంలో మాధుర్యం !!
విశ్వమంతా పరిచయం
గాయకుడైన అమృతం
అభినయాలు వివేకం
దైవారాధన అంకితం !!
అమూల్యమైన జీవితం
స్వరము నాదామృతం
దివిలో విరిసే పారిజాతం
మన దేశానికి ఆదర్శం !!
మాటలు గొప్పతనం
సంగీతం లో దర్శనం
తెలుగు వారి జ్ఞాపకం భారతీయ సినీ రంగం !!
సినిమా భక్తి సంగీతం
మధురానుభూతి సుస్వరం
పద్మశ్రీ పద్మభూషణం
ఎన్నో జాతీయ పురస్కారం !!